calender_icon.png 3 April, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమలో ఉన్నారా?

23-03-2025 12:00:00 AM

ప్రేమ ప్రయాణం మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. నా ఇష్టాలేంటి? నా అభిప్రాయాలేంటి? ప్రేమ గురించి నాకున్న ఆలోచనలు కరెక్టేనా? నాది ప్రేమా, ఇష్టమా, ఆకర్షణా? ఎదుటి వాళ్లు నా నుంచి ఏమి కోరుకుంటున్నారు? నా ప్రేమలో నిజాయితీ ఉందా? నేను ఇష్టపడే వాళ్లు ఎంతవరకు సరైన వాళ్లు? ప్రేమను ఇవ్వడంలో, తీసుకోవడంలో నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నేను ప్రేమించే వాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకవేళ బ్రేకప్ అయితే పాజిటివ్‌గా తీసుకోగలనా? చిన్నచిన్న తడబాట్లు, పొరపాట్లు జరిగితే తట్టుకుని ముందుకు వెళ్లగలనా?

అవసరం అయితే నా అభిప్రాయాలు మార్చుకోగలనా? అవతలి వాళ్లు కూడా మార్చుకుంటారా? లాంటి ప్రశ్నలను ఎవరికి వాళ్లు వేసుకోవాలి. వీటికి సరైన సమాధానాలు వస్తే ప్రేమలో రాబోయే సమస్యలను అధిగమించొచ్చు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇద్దరూ జీవితాంతం కలిసుంటామన్న నమ్మకం, భరోసా కలిగినప్పుడే ప్రేమను మరో మెట్టెక్కించడం మంచిదంటున్నారు నిపుణులు. ఇలాంటి ప్రేమలే శాశ్వతంగా నిలిచిపోతాయని, అందమైన అనుభూతుల్ని అందిస్తాయని చెబుతున్నారు.