కొంతమందికి అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆకలి వేస్తుంది. ఆ సమయంలో కిచెన్‌లోకి దూరి ఏదో ఒక ఫుడ్ వండి తినేస్తుంటారు. అయితే కేవలం ఐదు నిమిషాల్లో ఇష్టమైన ఫుడ్‌ను తయారుచేసుకొని ఇష్టంగా తినొచ్చు. అవేంటో తెలుసుకోండి. రాత్రిపూట ఆకలిగా అనిపించినప్పుడు నూడుల్స్ బెస్ట్ ఆప్షన్. వేడినీటిలో నూడుల్స్ లేదా సూప్ పౌడర్ కలపండి. కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత నోరూరించే నూడుల్స్ తినొచ్చు. ఇక రాత్రిపూట ఓట్స్ సహాయంతో రుచికరమైన ఫుడ్ రెడీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓట్స్‌ను ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
దానికి పాలు వేసి మైక్రోవేవ్‌లో 1-2 నిమిషాలు వేడి చేయండి. పైన తేనె, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి తినొచ్చు. ఇక బ్రెడ్ ఆమ్లేట్ కూడా తక్కువ సమయంలో త్వరగా తయారవుతుంది. తయారు చేసే విధానం కూడా ఈజీ. మొదట బ్రెడ్ కాల్చండి. ఆ తర్వాత ఓ గుడ్డును పగులకొట్టి దానిపై వేయాలి. దానిపై ఉప్పు వేయాలి. మైక్రోవేవ్‌లో 30 సెకన్ల పాటు వేడి చేయండి. ఆ తర్వాత జున్ను వేసుకొని తినేయొచ్చు.
ఇక పనీర్ టిక్కా, సలాడ్, క్యారెట్ హల్వాను ట్రై చేయండి. రాత్రిపూట వండుకునేవన్నీ రుచికరమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచివి కూడా. అయితే రాత్రిపూట ఆయిల్ ఫుడ్ తింటే జీర్ణంకాక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇది పలు అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీని కోసం తేలికపాటి ఆహారం మాత్రమే వండుకోండి.