calender_icon.png 20 October, 2024 | 11:22 AM

మీకు కలలు వస్తున్నాయా?

20-08-2024 12:30:00 AM

కలలు రావడం సర్వ సాధారణం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే కలలు రావడానికి అటు శాస్త్రంతో పాటు ఇటు సైన్స్ పలు కారణాలు చెబుతున్నాయి. మనసులో అణచి వేసుకున్న కోరికలే కలల రూపంలో వస్తాయని ప్రముఖ మానసిక వేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ పలు అధ్యయనాలు నిర్వహించి తెలిపారు. అయితే మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన వాస్తవిక జీవితంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ మనకు రాత్రి వచ్చే కొన్ని కలల అర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. సాధారణంగా చావు అంటే నెగెటివ్ అ నుకుంటాం కానీ చావును పాటిజివ్‌గానే తీసుకోవాలని నిపుణులు చెబుతు న్నారు. కలలో చావు కనిపిస్తే జీవితంలో కొత్త మార్పు ఏదో చోటు చేసుకోబోతుందని అర్థం చేసుకోవాలని అంటు న్నారు. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి కలలు వస్తే త్వరగా కోలుకుంటారని అర్థం అంట. 
  2. కలలో ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తే.. జీవితంలో మార్పును కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న జీవన శైలితో మీరు విసిగిపోయారని, కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు అర్థం.
  3. ఇక లైంగిక కోరికలకు సంబంధించి కల లు వస్తే.. మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారని అర్థం. అలాగే మీకు నచ్చిన వారి సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. 
  4. కలలో ఎత్తయిన ప్రదేశం నుంచి పడితున్నట్లు కలలో వస్తే.. మీ జీవితంలో ఏదో తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారని అర్థం. అయితే ఏదైనా విషయాన్ని అలాగే పట్టుకొని ఉండకుండా వదిలేయడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. 
  5. పడుకున్న సమయంలో పరీక్ష రాస్తున్న ట్లు కల వస్తే.. మీరు చాలాకాలం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాలి. ఎవరో మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారని మీరు భావిస్తున్నట్లు అర్థం. 
  6. బస్సు లేదా రైలు ఇలా ఏదైనా.. మిస్సయినట్లు కల వస్తే మీకు జీవితంలో ఏ దో అవకాశం చేజారుతోందన్న భయం ఉందని అర్థం. చేతుల వరకు వచ్చిన అ వకాశం చేజారి పోతుందా అనే భయం మీలో ఉందని అర్థం చేసుకోవాలి. 
  7. గాలిలో ఎగిరిపోతున్నట్లు కల వస్తే మీరు స్వేచ్ఛను కోరుకుంటున్నారని అర్థం. ఇష్టం లేని బంధంలో ఉన్నా, నచ్చని ఉద్యోగం చేస్తున్నా ఇలాంటి కలలు వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. 
  8. నీటిలో మునిగిపోయినట్లు కలలో కనిపిస్తే మీరు తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. ఏదో ఒత్తిడితో బాధపడే వారిలోనే ఇలాంటి కలలు వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.