09-02-2025 12:00:00 AM
డిన్నర్ ఎంత లేట్‌గా చేస్తే.. ఆరోగ్య సమస్యలను అంత కొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరి స్తున్నారు నిపుణులు. రాత్రి భోజనం తీసుకునేప్పుడు వీలైనంత త్వరగా ముందుగా ముగించేయాలని సూచిస్తున్నారు. ఇంతకీ డిన్నర్ లేట్‌గా తింటే ఏమవు తుంది? ఏ సమయంలో తింటే అనువైనదో.. దానివల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి.
డిన్నర్ ఆలస్యంగా చేయడం వల్ల కలిగే అతి ముఖ్యమైన సమస్య ఇది. కడుపు ఉబ్బరం, యాసిడ్ లాంటి సమస్యలు పెరుగుతాయి.
లేట్‌గా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహమున్నవారు కచ్చితంగా ఎర్లీగా డిన్నర్ చేయాలి. మెటబాలిజం తగ్గిపోతుంది. దీనివల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది.
పడుకునేముందు కడుపు నిండుగా తింటే నిద్ర వస్తుంది అనుకునేవారు జాగ్రత్త. డిన్నర్ లేట్‌గా చేయడం వల్ల నిద్ర సమస్యలు ఎక్కువైతాయి.
త్వరగా ఎందుకు చేయాలంటే..
డిన్నర్‌ని సూర్యస్తమయంలోపు పూర్తి చేస్తే చాలామంచిదని చెప్తున్నారు. కానీ.. అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి.. కనీసం రాత్రి ఎనిమిదిలోపు అయినా డిన్నర్‌ని ముగించేయాలని సూచిస్తున్నారు నిపుణులు. నిద్రకు రెండు గంటల ముందు డిన్నర్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు.