26-04-2025 12:32:28 AM
విలువైన వస్తువులను బ్యాంకుల్లో ఉంచండి
మీరు వెళ్తున్న సమాచారాన్ని పోలీస్ స్టేషన్ లో చుట్టుపక్కల వారికి చెప్పండి
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే : డీ జానకి, జిల్లా ఎస్పీ, మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : అసలే వేసవికాలం వచ్చేసింది... ఆపై విద్యార్థులకు అంత సెలవులు... ఇక ఎక్కడికోఒక చోటికి వెళ్లాలని తపన.. సొంత ఊర్లకు వెళ్లి కొంత విశ్రాంతి తీసుకోని వద్దామని ఆలోచన ప్రతి మనసుకు తట్టుతుంది. ఇలా ఎవరికి వారు సొంత ఊర్లకు, వివిధ ప్రాంతాలు సందర్శించేందుకు వెళ్లడం సహ జం.
కాగా మీరు ఊరు వెళ్తున్నప్పుడు కాస్త ఒక కన్ను మీ ఇంటిపై గట్టిగానే వేయవలసి అవసరం ఉంది. వేసవిలో అత్యధికంగా తా ళాలు వేసిన ఇండ్లలో చోరీలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ విషయాలనే పోలీస్ అధికారులు ప్రజలకు చెబుతున్నా రు. మీరు ఊరు వెళితే సమీపంలోని పోలీస్ స్టేషన్ కి సమాచారాన్ని ఇవ్వడంతో పాటు.. చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి ఉంచాలని గట్టిగా చెబుతున్నారు. ఈ నిబంధనలు పాటిస్తూ మీరు ఊరు వెళ్తే మీ ఇంట్లో ఎలాంటి చోరీలు జరిగే అవకాశం ఉండదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. నిరంతర పర్యవేక్షణ ఇంటిపై కూడా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.
జాగ్రత్తలు పాటించండి...
వేసవి సెలవు దినాలలో సొంత ఊరిలోకి, ఇతర ప్రాంతాలకు కనీస సూచనలు పాటించండి..
- వేసవి సెలవు దినాలలో సొం త ఊరిలోకి,టూర్లకి వెళ్లే వారు ముందుగా వారి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన గా బంగారం వెండి ఆభరణాలు, నగదును సాధ్యమైనంతవరకు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోగలరు. మీ వెంట తీసుకెళ్లగలరు.
- మీ ఇంటికి తాళాలు వేసి డోర్ కర్టెన్ కవర్ చేసేటట్లు ఉంచగలరు. ఇంటి లోపల ఒక లైటు వేసి ఉంచగలరు. మీ ఇంటి చుట్టుపక్కల వారిని మీ ఇంటిని గమనిస్తూ ఉండమ ని చెప్పగలరు.
- మీ ఇంటికి సీసీటీవీ కెమెరా లు అమర్చుకొని వాటిని కూనికి అనుసంధా నం చేసి అప్పుడప్పుడు చూస్తూ ఉండగలరు. ఒకవేళ మీ వెంట బంగారు ఆభరణాలు తీసుకెళ్తున్నట్లయితే బస్సులు ఎక్కేటప్పుడు రద్దీ లేని బస్సుల్లో వెళ్లడానికి ప్రయత్నం చేయగలరు.
- పాలు పేపర్ వేసేవారికి వేయవద్దని చెప్పాలి,గేటు తాళాలు లోపల వైపు నుంచి వేసుకోగలరు, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటవైపు వేయకూడదు. మీ వాహనాల తాళపు చేతులను ఇంటి లోపల కనిపించకుండా దాచగలరు. బస్సులు ఎక్కేటప్పుడు ఎవరైనా గుర్తు తెలియని మహిళలు గాని, సాదా దుస్తుల్లో గాని ఉండి, మీరు బస్సు ఎ క్కేటప్పుడు గాని దిగేటప్పుడు గాని అటు ఇ టు తోయడం, మీ వెంట కూర్చున్నప్పుడు మీ దృష్టి నీ మరల్చి బ్యాగులు నుండి పర్సు లోనుండి దొంగిలించే అవకాశం ఉంటుంది. మీరు ఊరికి వెళుతున్నట్లయితే ఆ సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో ఇవ్వగలరు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
నిరంతరము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి సెలవుల్లో చాలామంది తమ ఇండ్లకు తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళుతుంటారు. ఈ విషయాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్లో కూడా ఇస్తే బాగుంటుంది. దీంతోపాటు చుట్టుపక్కల వారికి కూడా సమాచారం ఇవ్వాలి. ని రంతరం ఇటువైపు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
డి జానకి, జిల్లా ఎస్పీ, మహబూబ్ నగర్