calender_icon.png 21 April, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నట్టుండి పడిపోతున్నారా?

11-04-2025 12:47:23 AM

  1. పార్కిన్సన్స్ వ్యాధి కావచ్చు..
  2. వైద్యులను సంప్రదించడం మేలు
  3. ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ అనిరుధ్‌రావు దేశ్‌ముఖ్
  4. నేడు ప్రపంచ పార్కిన్సన్స్ డే

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ‘ఆరు పదుల వయసు దాటిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారన్నది పిల్లలు గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అంతకుముందు చురు గ్గా తిరిగిన తండ్రి.. ఇప్పుడు ఉన్నట్టుండి డల్ గా మారిపోవడం, శరీరమంతా బిగుసుకొని ఉండిపోవడం, ఎక్కువగా నడవలేకపోవడం, ఒకవేళ నడిచినా పడిపోతుండడం లాంటి లక్షణాలు కనపడితే, అది కేవలం వయసు ప్రభావం మాత్రమే కాదు..

పార్కిన్సన్స్ డిసీ జ్ కావచ్చు. అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రాలజిస్టును సంప్రదించాలి’ అని హైదరాబాద్‌కు చెందిన ఆస్టర్ ప్రైమ్ ఆ స్పత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిరుధ్‌రావు దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ నెల 11న ప్రపంచ పార్కి న్సన్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మన శరీరం లో ఇన్సులిన్ తగ్గితే మధుమేహం ఎలా వస్తుందో.. అలాగే డొపమైన్ తగ్గితే పార్కిన్స న్స్ వస్తుంది.

సాధారణంగా ఇది 60 ఏళ్లు దాటినవారిలోనే కనిపిస్తుంది. కానీ, ఇటీవల కొన్ని కేసుల్లో మాత్రం 20లలో ఉన్నవారికి కూడా చూస్తున్నాం. ఇతర వ్యాధుల్లా కాకుం డా.. శారీరకంగా కనిపించే లక్షణాలను బట్టే దీన్ని గుర్తించేందుకు కొంతవరకు అవకాశం ఉంటుంది. ఎక్కువగా మాట్లాడకుండా మౌ నంగా ఉండిపోవడం, గతంతో పోలిస్తే బాగా డల్‌గా ఉండడం, ముఖంలో ఎలాంటి హావభావాలు పలికించకపోవడం.. ఇలాంటివన్నీ పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలే’ అని చెప్పారు.