13-04-2025 12:00:00 AM
మనలో కొందరికి రాత్రి భోజనం చేసిన తర్వాత స్వీట్లు, కేక్స్, ఐస్‌క్రీమ్స్, చాక్లెట్లలో ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. ఇది మానుకోవాలి అనుకున్నా కొందరు బయటపడలేరు. అయితే రాత్రి డిన్నర్ చేశాక స్వీట్లు తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం..
* రాత్రి భోజనం తర్వాత స్వీట్లను ఎక్కువగా తింటే టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.
* రాత్రిపూట చక్కెరతో చేసిన పదార్థాలు తినడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది.
* స్వీట్లు తిని పడుకోవడం వల్ల దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. దంతాలకు రక్షణగా నిలిచే ఎనామిల్ క్షీణిస్తుంది. కొన్నిసార్లు పిప్పళ్లు కూడా ఏర్పడతాయి. అలాగే నోటి దుర్వాసనకు కారణమవుతుంది.
* అందుకే రాత్రివేళ చక్కెరతో చేసిన స్వీట్లకు వీలైనంత దూరంగా ఉండాలి. పగలైనా సరే చక్కెరతో చేసిన పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవడమే అన్ని విధాల మంచిది.