09-03-2025 12:00:00 AM
మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మనం తినే వాటి ప్రభావం నేరుగా ఆరోగ్యంపై పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యం కోసం ఏబీసీ జ్యూస్‌లు తాగమని చెబుతున్నారు నిపుణులు. వీటిలో పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఏబీసీ జ్యూస్ వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం..
ఏబీసీ జ్యూస్ అంటే.. యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో తయారు చేస్తారు. వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వీటిలో 45 కెలరీలు, 10 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఏబీసీ జ్యూస్‌లో 8 గ్రాముల వరకు షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0.5 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. కాగా ఈ జ్యూస్ తాగితే.. హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని మలినాలన్నీ క్లీన్ అవుతాయి.
బరువు తగ్గడంలో ఈ జ్యూస్‌లు బాగా పనిచేస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపడుతుంది. పేగు కదలికలను మెరుగుపర్చడానికి, మలబద్దకం తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ జ్యూస్ రక్తపోటును నియంత్రించడమే కాదు.. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.