calender_icon.png 13 February, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగడుగునా వసూళ్లే?

13-02-2025 12:59:53 AM

  1. ఒక్కో పనికి ఒక్కో రేటు 
  2. గేటు దాటలన్నా పైసలియ్యాల్సిందే
  3. రోగిని వీల్‌చైర్ పైన తీసుకెళ్లినా చెల్లించాలి
  4. వనపర్తి ధర్మాసుపత్రిలో సిబ్బంది దోపిడీ

* వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగడుగునా వసూళ్ల పర్వ కొనసాగుతున్నది. ఒక్కో పనికి ఒక్కో రేటు.. అడుగడుగునా సిబ్బంది చేయి తడపాల్సిందే. రోగి గేటు దాటాలంటే ఒక రేటు, రోగిని వీల్‌చైర్ పైన ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్లడానికి ఒక రేటు, రోగి దుస్తులు మార్చాలంటే ఒక రేటు, సాధారణ కాన్పు అనంతరం పర్యవేక్షణ గదికి తీసుకెళ్లేందుకు ఒక రేటును నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. 

 వనపర్తి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసుపత్రి ద్వారా ఉచితంగా వైద్య సేవలతో పాటు రోగం నయం అ  ఎంతో విలువైన మందులను  ఉచితంగా అందజేస్తున్నది. కానీ వనపర్తిలోని ధర్మాసుపత్రికి వెళ్తే రోగం నయం  డబ్బులు ముట్టజెప్పాల్సిందే.

లేదంటే అడుగు కూడా ముందుకు పడే పరిస్థితి లేదన్నట్లుగా వసూళ్ల పర్వం నడు   జేబులో డబ్బులు లేకుంటే కనీసం ఆసుపత్రి గేటు కూడా దాటే పరిస్థితి ఉండనంతగా ఆసుపత్రి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. డాక్టర్లు అందించే వైద్యానికి తప్పా మిగిలిన సౌకర్యాలు అన్నింటికి ముడుపులు ముట్టజెప్పాల్సిందే. 

కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు?

పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆకస్మిక తనిఖీలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేర  కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు ప్రభు  ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. అయినా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న సిబ్బంది కొందరు భయపడకుండా వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు.

నిరుపేదలు అన్న కనికరం లేకుండా యూరిన్ బ్యాగ్ మార్చాలన్న కాసులు ముట్టజెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఈ దోపిడీపై పలుమార్లు ఆసుపత్రి పర్యవేక్షణ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవ  వెనుక ఆంతర్యం ఏమిటోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆసుపత్రిలో దళారులు! 

కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన పేదలను డబ్బుల కోసం పట్టిపీడిస్తున్నారు. ఆసుపత్రిలో దళారులు తిష్టవేసి నిరుపేద రోగుల నుంచి డబ్బులను దండుకుంటున్నారు. తమను ఇబ్బంది పెడుతున్నారని పేదలు వాపోతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లే సాహసం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉద్యోగం నుంచి తొలగిస్తాం

వనపర్తి ఆసుపత్రిలో రోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు నిర్ధారణ అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని ఉద్యోగంలో నుంచి శాశ్వతంగా తొలగిస్తాం. ఇప్పటికే వచ్చిన పలు ఫిర్యాదులను బట్టి వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నాం. ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా ఆర్‌ఎంవోలు లేదా జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చు. 

 రంగారావు, సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి, వనపర్తి

వసూళ్లు ఇలా 

పేషెంట్ వీల్‌చైర్‌కు రూ.300

డ్రెస్ మారిస్తే రూ.200

యూరిన్ బ్యాగ్ మారిస్తే రూ.100

సహజ కాన్పుల నుంచి బెడ్    

వరకు మార్చడానికి రూ.300

ఆపరేషన్ తదనానంతరం 

పర్యవేక్షణ గదికి రూ.300