* అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
* కొత్తవారి కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలి
వనపర్తి, జనవరి 9 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుం డటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుం టారు . ఇదే అదనుగా భావించిన దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్న సందర్భాలను చూ స్తుంటాం. సంక్రాతి సెలవులకు ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండడమే కాకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాలు జరుగకుండా కట్టుదిట్టం చేయడం సైతం జరుగుతుందని జిల్లా రావుల గిరిధర్ తెలుపుతున్నారు.
ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు
* దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను సంబం ధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమో దు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
* బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం వేసి న తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి.
* విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు. ద్విచక్రవాహ నాలు, కారులను ఇంటి ఆవరణలోనే పా ర్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.
* విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ఆరుబయట వాహనాలకు హాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ వేయాలి. వా మెన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసు కోవాలి.
* ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచు కోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్ల కు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అప హరిస్తారు.
* హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంట ర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్/ప్రత్యక్షంగా చూసుకునే వీలుంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సిసిటివి లు ఆన్లున్/ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. హోమ్ సెక్యూరిటీ సర్వెలెన్స్ కు ఇవి ఎంతో ఉపయుక్తం.
* ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పా టుకు సహకరించాలి. పోలీసు స్టేషన్ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంత రం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.
* అనుమానిత వ్యక్తుల కదలికలను గమ నించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సంక్రాతి పండుగ నేపథ్యంలో వరు సగా సెలవులు రావడం వల్ల చాలా మం ది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడం సహజం. ఇటువంటి సమయాల్లోనే దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి. ఈ నేపథ్యంలో పోలీసు లు సూచిస్తున్న సూచనలు పాటించి నట్లయితే దొంగతనాలు జరుగకుండా నిలువరించవచ్చు.
కాలనీల్లో దొంగతనా ల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబా టులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా వనపర్తి పోలీసు వాట్సాప్ నెంబర్ 630 3923200కు సమాచారం ఇవ్వాలి.
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్