బుజ్జాయిలకు బొమ్మలతో ప్ర త్యేక బాండింగ్ ఉంటుంది. పిల్లలు పుట్టినప్పట్నుంచే తల్లిదండ్రులు ఇష్టమైన బొమ్మలు కొనేస్తూ తెగ మారం చేస్తుంటారు. అయితే మార్కెట్లో దొరికే బొమ్మలు విషపూరిత రసాయనాలతో తయారవుతున్నాయి. వాటిని నోట్లో పెట్టుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడొచ్చు. అందుకే పిల్లలకు బొమ్మలకు కొనిచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
ఈ రోజుల్లో చాలామంది పిల్లలు సహజమైన బొమ్మలకు బదులు ఎలక్ట్రానిక్ బొమ్మలనే ఇష్టపడుతున్నారు. ఎలక్ట్రానిక్ బొమ్మల తయారీలో వాడే పదార్థాలు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ఇందులోని లోహాలు పిల్లల్లో అలర్జీ సమస్యలకు కారణమవుతున్నట్లు పిల్లల డాక్టర్లు కూడా గుర్తించారు. పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు అడిక్ట్ కావడం వల్ల తల్లిదండ్రులు కూడా ఎలక్ట్రానిక్ బొమ్మలను కొనిస్తున్నారు.
అయితే ఈక్రమం లో ఎలక్ట్రానిక్ టాయ్స్ స్క్రీన్ వాడకం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్నవయసులోనే కంటి సమస్యతో బాధపడుతున్న ట్లు పలు సర్వేలు తేల్చిచెప్పాయి.
సహజమైన బొమ్మలు..
ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ బొమ్మలకు బదులు సహజమైన బొమ్మలను వాడాలని చెబుతున్నారు చాలామంది. ఈ క్రమంలో నిర్మల్ కొయబొమ్మలు, అందమైన కొండపల్లి బొమ్మలు పిల్లలు ఆడుకునేందుకు అనువుగా ఉంటాయి. వీటి వల్ల పిల్లలకు ఆరోగ్యంతోపాటు మన కల్చర్‌ను పరిచయం చేయొచ్చు. మిషన్‌తో కుట్టిన బొమ్మలూ ఇవ్వొచ్చు. ప్లాస్టిక్ బొమ్మలతో పోల్చిస్తే ఇవి ఎంతో మంచివి.
అలాగే చెక్క బొమ్మలు తరచుగా ప్లాస్టిక్ బొమ్మల కంటే సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. చెక్క బొమ్మలు విషపూరిత రసాయనాలు లేనివి, పిల్లలకు హాని కలిగించే ఎటువంటి హానికరమైన పదార్థాలను కలిగి ఉండవు. చెక్క బొమ్మలు విరిగిపోయే లేదా చీలిపోయే అవకాశం తక్కువ కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
ఏకోఫ్రెండ్లీ బొమ్మలు బెస్ట్
ప్రస్తుతం మార్కెట్లో ఏకో ఫ్రెండ్లీ బొమ్మలు దొరుకుతున్నా యి. అయినా చాలామంది చైనా బొమ్మలను కొనేస్తున్నారు. వాటి ని పిల్లలు నోట్లో పెట్టుకోవడం వల్ల బొమ్మకు వాడిన రంగులు శరీరంలోకి వెళ్తాయి. బ్యాటరీతో తయారయ్యే బొమ్మలతోనూ పిల్లలకు అలర్జీ సమస్యలొస్తున్నాయి. అలాగే వయోలెన్స్ కూడిన బొమ్మలను కొనివ్వడం వల్ల పిల్లలను హింస వైపునకు ప్రేరేపించి నట్టుగా ఉంటుంది. అందుకే ఎడ్యుకేషన్ సంబంధింత టాయ్స్ ను ఎక్కువగా పరిచయం చేయా లి.
జర్మనీ, జపాన్‌లో ఇలాంటి బొమ్మలే ఎక్కువగా ఉంటాయి. అవన్నీ బ్రెయిన్‌కు పదునుపెట్టేవిధంగా ఉంటూ పిల్లలను ఎంటర్‌టైన్ చేస్తాయి.
పిల్లల చేతికి ప్లాస్టిక్ బొమ్మలను అందించే అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు ఆడుకొనే ప్లాస్టిక్ బొమ్మలు ఏ మేరకు సురక్షితం అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక అంతర్జాతీయ అధ్యయనంలో బొమ్మల తయారీలో సుమారు 100కు పైగా ప్రాణాంతకమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ రసాయనాల నుంచి పిల్లలను రక్షించాలంటే ప్లాస్టిక్ బొమ్మలకు దూరంగా ఉంచాలి.. అలాగే అవసరాని కంటే ఎక్కువ బొమ్మలు కొనిస్తే పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకత దెబ్బతింటుందనే విషయాన్ని కూడా గుర్తించుకోవాలి.
-చిన్న బొమ్మలు వద్దు
గోలీలు, చిన్నపాటి బొమ్మలు లాంటివి కొనివ్వకూడదు. వీటిని వీలైనంతవరకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి పిల్లల గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. తల్లిదండ్రులు అన్ని సమయాల్లో పిల్లలపై దృష్టి పెట్టడం కష్టం. అందుకే పిల్లల నోటిలో పట్టే బొమ్మల్ని కొనొద్దు. అలాగే బొమ్మలకు బటన్లు ఉంటాయి. అవి నోట్లోకి వెళ్తే మరింత ప్రమాదం ఉంటుంది.
తక్కువ ధరతో..
మార్కెట్లో రకరకాల బొమ్మలుంటాయి. అందులో కొన్ని చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. అలాంటి బొమ్మలు నాసిరకం, హానికరమైన పదార్థాలతో తయారవుతాయని తెలియక ఎక్కువగా కొనేస్తుంటారు. అయితే ఇవి త్వరగా పాడవ్వడమే కాకుండా.. పిల్లల ఆరోగ్యానికి కూడా ముప్పు కలిగిస్తున్నాయి. భద్రతా ప్రమాణాల్ని అనుసరించే టాప్ బ్రాండ్ల బొమ్మల్ని కొంటేనే పిల్లలకు మంచిది. అలాగే గన్స్, బాంబ్స్ వంటి అనేక బొమ్మలు మార్కెట్లో లభిస్తున్నాయి.
ఈ బొమ్మలను ఇవ్వడం వల్ల పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ రకమైన బొమ్మలు పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఇలాంటి వాటిని కొనకపోవడమే ఉత్తమం.
బొమ్మలు కొనేముందు
ఇటీవల భారత ప్రభుత్వం ఏడు నుంచి 14 సంవత్సరాల పిల్లల కోసం బొమ్మల కోసం నాణ్యత నియంత్రణ ఆర్డర్ (క్యూసీఓ)ని అమలు చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు బొమ్మలు కొనే ముందు ఈ ప్రత్యేక గుర్తును చూసుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వం పిల్లల కోసం బీఐఎస్ చట్టం, 2016 సెక్షన్ 16 ప్రకారం 2020 కోసం టాయ్స్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసీఓ)ని జారీ చేసింది. బొమ్మల నాణ్యతను కాపాడేందుకు బొమ్మల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులపై ఐఎస్‌ఐ గుర్తు పెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
వినియోగదారులు బొమ్మలపై ఐఎస్‌ఐను గమనించాలి. లేని పక్షంలో బొమ్మలు తయారుచేసే కంపెనీపై చర్యలు తీసుకోవచ్చని ప్రభ్వుతం చెప్పింది.