calender_icon.png 4 March, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చూసిందల్లా కొనేస్తున్నారా..?

02-03-2025 12:00:00 AM

చాలామంది మహిళలు చూసిందల్లా కొనేస్తుంటారు. ఆభరణాలు, చీరలు, ఇతర సామాన్లు ఇలా ప్రతీది కొంటారు. అయితే డబ్బు పొదుపు చేయటం అంటే సంపాదించినట్టే. అందుకే ఖర్చు విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి. కంటికి కనిపించినవన్నీ కొనేస్తుంటే డబ్బు వృథాతోపాటు చెత్తలా పేరుకుపోతాయి. కొన్ని వస్తువులు తాత్కాలికంగా ఆనందం ఇవ్వొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఉపయోగం లేదు.

ఏది అవసరం, ఏది అనవసరం అనేదానిపై కనీస అవగాహన ఉండాలి. చెప్పులు, దుస్తులు ఇలా ఏ వస్తువైనా సరే అవసరం మేరకు మాత్రమే కొనుక్కుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే ఇల్లు ఎంత తక్కువ సామానుతో ఉంటే అంత అందం. ఏ వస్తువు కొన్నా దాంతో ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం రకరకాల మల్టీపర్పస్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. అవేంటో తెలుసుకొని కొనుకుంటే బాగుంటుంది.