23-02-2025 12:21:07 AM
ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. బయట వేడి తట్టుకోలేక చాలామంది చల్లదనం కోసం ఏసీ కొనడానికి మొగ్గుచుపుతున్నారు. అ యితే ఏసీ కొనేముందు కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతు న్నారు నిపుణులు.
నచ్చిన షాపులోకి వెళ్లి.. ఏసీకి ఎంత బడ్జెట్ అనుకున్నారో దానికి అనుగుణంగానే సరిపోయే నాణ్యమైన కంపెనీని ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ సెలక్షన్ త్వరగా పూర్తవుతుంది. లేదంటే ఏది కొ నాలో తెలియక ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది.
గది పరిమాణం ఎంత ఉందనే వి షయాన్ని కూడా పరిగణనలోకి తీ సుకోవాలి. చిన్న గదులకు ఒక ట న్ను ఏసీ సరిపోతుంది. అదే పెద్ద గ దులైతే దానికి ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకోవాల్సి ఉంటుంది.
మీరు ఉండే ఫ్లోర్‌ను, స్థలాన్ని బట్టి కూడా ఏసీ పనితీరును ఎంచుకోవాల్సి ఉంటుంది. సరైన కూలింగ్ ఎఫెక్ట్ కోసం ఏసీ సామర్థ్యాన్ని 0.5 టన్నుల వరకు పెంచుకోవచ్చు.
ఇంట్లో ఉండే వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఏసీ కొనుగోలు చేసుకోవా ల్సి ఉంటుంది. ఎందుకంటే రద్దీగా ఉండే గదిలో అదనపు వేడి ఉత్పత్తి అవుతుంది.
స్లిట్ లేదా విండో ఏసీలు రెండూ బాగానే పనిచేస్తుంటాయి. కానీ విండో ఏసీలు సాధారణంగా తక్కు వ ఫీచర్లతో ఉన్నప్పటికీ మంచి ధరకే లభిస్తుంటాయి.