23-03-2025 12:00:00 AM
మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు అనారోగ్యానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో బ్రష్ ఒకటి. మనలో చాలామంది బ్రష్‌లను బాత్‌రూమ్‌లో పెడుతుంటారు. అయితే దీనివ ల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలుసా? ఇంతకీ బ్రష్‌లను బాత్‌రూమ్‌లో పెడితే ఎలాంటి సమస్యలు వస్తా యో తెలుసుకుందాం..
టాయిలెట్‌కి దగ్గరా బ్రష్‌లను ఉంచితే వాటిపై అనేక రకాల క్రిములు చేరే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు.. సూక్ష్మ కణాలు గాలిలోకి ఎగిరిపోతాయి. ఇవి టూత్‌బ్రష్ లేదా ఇతర వస్తువులపై పడుతాయి. దీంతో టూత్ బ్రష్‌పై ఈ కోలీ, స్టుప్టోకోకస్ వంటి బ్యాక్టీరియా చేరుతాయి. ఇలాంటి బ్రష్‌లను ఉపయోగిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్‌లో పది నిమిషాల పాటు బ్రష్‌ను నానబెట్టాలి. ఇది బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. మనలో చాలామంది నెలల తరబడి ఒక్కటే బ్రష్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే కచ్చితంగా కనీసం మూడు నెలలకొకసారి బ్రష్ మార్చాలని సూచిస్తున్నారు నిపుణులు.