calender_icon.png 30 September, 2024 | 4:48 AM

బామ్మర్దితో నోటీసులిస్తే భయపడుతామా?

30-09-2024 02:53:09 AM

  1. నిన్ను నీ ఢిల్లీ దోస్తులు కూడా కాపాడలేరు
  2. హైదరాబాద్‌లో నేడు పేదల కన్నీళ్లు, ఆక్రందనలే
  3. నాడు రిజర్వాయర్‌ను అడ్డుకున్న సన్నాసి ఇప్పుడెక్కడ
  4. సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తన బామ్మర్దికి అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టడాన్ని ప్రశ్నిస్తే  బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర హం వ్యక్తంచేశారు.

హైడ్రాతో పేదల ఇళ్ల ను కూలగొట్టడంపై ఆయన ఎక్స్‌లో ఆదివారం ఆగ్రహం వ్యక్త ంచేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి.. మీ బామ్మర్దితో నోటీసులు ఇప్పిస్తే మీ అక్రమ దందాల గురించి మాట్లాడటం బంద్ చేస్తామని అనుకుంటున్నావా? బామ్మర్దికి అమృ తం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం.

తన బామ్మర్ది కంపెనీకి సీఎం రూ.1,137 కోట్ల టెండర్లు కట్టబెట్టింది నిజం కాదా? అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11, 13 లను సీఎం ఉల్లఘించిన మాట నిజం కాదా? ఢిల్లీలో ఉన్న రేవంత్ దోస్తులు ఆయనను కాపాడటం కష్టమే’నన్నారు 

రేవంత్ లక్షన్నర కోట్ల ధనదాహం

రేవంత్ రూ.౧.౫ లక్షల కోట్ల మూసీ ధనదాహానికి హైదరాబాద్‌లో లక్షలమంది పేద లు బలవుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గుండెలు పగిలి, గూళ్లు చెదిరి, ఆడ బిడ్డల ఆవేదనలు. ఇంటి పెద్దల శాపనార్ధాలతో మహానగరం కన్నీరు పెడుతోందని అన్నారు.

రెక్కలు ముక్కలు చేసుకొని కలలు కుటీరాలను నిర్మించి కన్న బిడ్డలకు ఇవ్వలేకపోతున్నామ ని ఒక తల్లి, అమ్మలాంటి ఇల్లు వదిలి వేరే దిక్కు ఎలా పోతామంటూ మరో తండ్రి గుండెలు బాదుకుంటున్నారని తెలిపారు. ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్న తల్లి, భార్య కడుపుతో ఉంది కనికరించరా అని ఒంటిపై పెట్రోల్ పోసుకున్న భర్తను చూస్తున్నామని పేర్కొన్నారు.

నాడు రైతుల ప్రయోజనం కోసం 30 వేల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో 20 కార్లతో రైతులను రెచ్చగొడుతూ శవాలపై పేలాలు ఏరుకున్న సన్నా సీ ఇప్పుడు ఎక్కడునావ్ అని సీఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకపడ్డారు. జరుగుతున్న విధ్వం సానికి భయపడి ప్రజలు ప్రాణాలు తీసుకోవద్దని, పోరాడేందుకు న్యాయస్థానాలు ఉన్నాయి, మీకు మద్దతుగా మేమున్నాం అని భరోసానిచ్చారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్ కోలుకోవడంతో సోమ, మంగళవారం మూసీ పరీ వాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు.