ఫార్ములా ఈ రేస్ కేసుపై ప్రభు త్వం సీరియస్‌గా దర్యాప్తు చేస్తోంది. అయి తే ఈ కేసు ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందు లో ఏసు1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ అదో లొట్టపీసు కేసు అంటూ వ్యా ఖ్యానిస్తున్నాడు. అసలు ఈ కేసే నిలబడదన్నట్టు తన మాటల తీరు కనిపించింది. కానీ, ఈ కేసులో ఆర్బీఐ అనుమతులు లేకుండా విదేశీ కరెన్సీ చెల్లింపుల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈడీ రంగంలోకి దిగింది. ఓవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ విచారణ వేగవంతం చేస్తున్నాయి.
క్రమంగా ఈ కేసు విచారణ వేగం పుంజుకోవడంతో పార్టీ నేతల్లో ఆం దోళన పెరిగింది. లొట్టపీసు కేసు అంటున్నా ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఎల్‌ఎన్‌రెడ్డి, అర్వింద్ కుమార్ తాము కేటీఆర్ చెప్పినందుకే మనీ ట్రాన్స్‌ఫర్ చేశామంటూ ఏసీబీకి చెప్తున్నారు. ఫలితంగా ఈ కేసులో వేళ్లన్నీ కేటీఆర్‌వైపే చూపిస్తున్నాయి. దీంతో లొట్టపీసు కేసు కాస్త గట్టి పీసుగా మారి కేటీఆర్ మెడకు చుట్టుకునేలా ఉందంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో తమ నాయకుడి పరిస్థితి ఏంటని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.