calender_icon.png 15 January, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్‌కు అడిక్ట్ అయ్యారా..?

05-09-2024 12:00:00 AM

చాలా మందికి సెల్ ఫోన్‌లు నిత్యావసరంగా మారాయి. ప్రస్తుత ప్రపంచంలో ఫోన్ లేనిదే రోజు గడవడం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరికి అవసరంగా మారింది. అమెరికన్‌లు రోజుకు సగటున 5.4 గంటలు తమ ఫోన్లలో గడుపుతున్నారని సర్వేలో తెలింది. ఈ క్రమంలో కొందరు వినియోగదారులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో సంభాషించడం, స్నేహితులతో కలిసిపోవడం తగ్గిపోతోంది. ఇతర వయసుల వారితో పోలిస్తే టీనేజర్లు సెల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. టీనేజర్లు ఎల్లప్పుడూ స్క్రీన్ సమయాన్ని నియంత్రించలేరు. నిత్యం సోషల్ మీడియాలో గడుపుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు.

చిన్న చిన్న టిప్స్ పాటిస్తే.. అడిక్షన్ నుంచి బయటపడొచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా కుటుంబంతో భోజనం చేసేటప్పుడు ప్రతిరోజూ కొన్ని గంటలపాటు మొబైల్ ను దూరంగా పెట్టొచ్చు. డేటా వినియోగాన్ని కూడా తగ్గించండి. గేమ్స్, సోషల్ మీడియా లాంటి నోటిఫికేషన్స్ మ్యూట్‌లో పెట్టండి. అందుకు మొబైల్ సెట్టింగ్స్ మార్చండి. ఇష్టమైన రంగంలో (పెయింటింగ్స్, మ్యూజిక్, గేమ్స్) బిజీ అయితే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.