calender_icon.png 28 October, 2024 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెత్తబండ్లూ చెత్త పాలేనా?

12-08-2024 12:09:05 AM

  1. గ్రామాల్లో లోపించిన చిత్తశుద్ధి 
  2. బాధ్యతను విస్మరిస్తున్న అధికారులు 
  3. కొరవడిన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ

సిద్దిపేట రూరల్, ఆగస్టు 11: సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణకు గత ప్రభుత్వం అందజేసిన చెత్తబండ్లు మూలనపడ్డాయి. పం చాయతీ కార్యదర్శులు, స్థానిక అధికారులు వాటిని విస్మరిస్తున్నారు. ప్రత్యేక అధికారులు సై తం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని 499 గ్రామ పంచాయతీలకు గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంటింట చెత్తను సేకరించేందుకు ప్రతి గ్రామపంచాయతీకి రెండు నుంచి మూడు చొప్పున చెత్తబండ్లు పంపిణీ చేసింది. వాటితో కొంత కాలం పారిశుద్ధ్య కార్మికులు గ్రామాల్లోని వీధుల్లో తిరిగి చెత్తను సేకరించారు. ఆ తర్వాత అధికంగా చెత్తను సేకరించేందుకు గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు ఇచ్చారు.

చిన్న గ్రామాల్లో కొంత మేరకు ప్రయోజనకరంగా ఉన్నా... మేజర్ గ్రామపంచాయతీల్లో ఒకే ట్రాక్టర్‌తో చెత్త సేకరణ కష్టమవుతున్నది. ట్రాక్టర్లు వెళ్లలేని గల్లీలలో ఈ చిన్న బండ్ల ద్వారా సేకరించాల్సిన అవసరం ఉంది. కానీ వాటిని అస్సలు ఉపయో గించడం లేదు. ఖాళీ ఉంచడంతో చెత్తబండ్లు తుప్పుపట్టిపోతున్నాయి. వాటిని పరిశీలించే తీరికలేని విధంగా పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కూడా కరువైంది. ట్రాక్టర్ వెళ్లని వీధుల్లోనైనా ఈ చిన్న చెత్తబండ్లు ఉపయోగిస్తే గ్రామంలోని ప్రతి వీధి శుభ్రంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

చెత్తబండ్లు వినియోగంలోకి తెస్తాం

ప్రస్తుతం గ్రామాల్లో ట్రాక్లర్ల ద్వారా నే చెత్తను సేకరిస్తున్నాం. ట్రాక్లర్లు వెళ్లలేని గల్లీలలో చెత్త బండ్లను ఉపయో గించాలి. గ్రామాల్లో నిరుపయోగం గా ఉన్న బండ్లను వినియోగంలోకి తెస్తా ము. గ్రామాల పరిశుభ్రత కోసం, ప్రజ ల ప్రయోజనార్థం కోసం తిరిగి ఉపయోగించే విధంగా అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తాం. 

 బి.దేవకీదేవి, జిల్లా పంచాయతీ అధికారి, సిద్దిపేట