calender_icon.png 19 April, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ మార్పులొస్తున్నాయా?

13-04-2025 12:00:00 AM

సడన్‌గా బరువు పెరగడం, తగ్గటం, నెలసరి సమస్యలు, థైరాయిడ్, అలసట వంటి సమస్యలకు హార్మోన్ల అసమతుల్యత కారణం కావొచ్చు. దీన్ని ఎలా అధిగమించాలంటే..

* యుక్త వయసులో మొటిమలు రావడం, నెలసరి సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం హార్మోన్ల అసమతుల్యత వల్ల రావొచ్చు. కాబట్టి ఈ వయసులో జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది. 

* ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లు హెచ్చుతగ్గులకు గురవుతాయి. బిడ్డ పుట్టాక పోషకాహారం ఎక్కువ తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. 

* రోజూ తీసుకునే ఆహారంలో చక్కెర తగ్గించండి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాన్ని తీసుకోండి. చేపలు, మాంసం, గుడ్లు, డ్రైఫ్రూట్స్, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. 

* రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి.