ఆంధ్రప్రదేశ్: జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు వస్తున్నవారికి బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల సంఘం అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. స్వస్థలాల్లో ఓటు వేసేందుకు వస్తున్నవారు బస్సులు లేక తీవ్రఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఉపాధి కోసం వెళ్లినవారు ఓటు వేయాలనే బాధ్యతతో వస్తున్నారని పేర్కొన్నారు. అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయడం ఆర్టీసీ అధికారుల కనీస బాధ్యత అన్నారు. ఈ విషయాన్ని ముందుగా అంచనా వేయకుండా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని ఆయన సూచించారు.