calender_icon.png 20 April, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగలకుంట ఉన్నట్టా? లేనట్టా?

17-04-2025 12:17:30 AM

  1. దశాబ్ద కాలంగా చర్చనీయాంశంగా దొంగల కుంట
  2. హద్దులు కేటాయించాలని గతంలో తాసీల్దార్‌కు లేఖ రాసిన : మనోహర్, ఇరిగేషన్ ఈఈ
  3. లెటర్ ఇచ్చింది వాస్తవమే: ఘాన్సీ రామ్ నాయక్, అర్బన్ తాసీల్దార్ 
  4. అది కుంట కాదు మా పట్ట భూమి: ఎస్ పద్మలత, పట్టాదారురాలు 

మహబూబ్‌నగర్ ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): మహబూబ్‌నగర్ పట్టణంలో హాట్ టాపిక్ గా దొంగలకుంట వ్యవహారం చర్చినీయాశంగా మారింది. మంగళవారం దొం గల కుంట అనే పిలవబడే కుంట దగ్గరికి హిటాచి, భారత్ బెంజ్ వాహనాలు అర్ధ రాత్రి రావడంతో అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి కుంటకట్ట ను తొలగించడం ఏంటని వారు ప్రశ్నిం చారు.

దీంతో రూరల్ ఎస్‌ఐ విజయ్ కుమా ర్ సైతం కుంట దగ్గరికి చేరుకొని అక్కడ ఎలాంటి గొడవలు కాకుండా ఇరువురికి సర్ది చెప్పారు. అప్పటికి ఆ పనులు ముగించినప్పటికీ బుధవారం ఉదయం మూడు గంటల కు తిరిగి కట్ట తొలగించే పనులు ప్రారంభమైనట్లు స్థానికులు చెప్పారు. అసలు పట్ట ణంలో ఇరిగేషన్ రికార్డులో దొంగలకుంట ఉన్నట్టా..? లేనట్టా.. ?అనే సందేహం పట్టణవాసులకు నెలకొంది.

ఈ దొంగలకుంట పేరుపై ఉన్న భూభాగం  పై గత పది సంవత్సరాల నుంచి అప్పుడు ఇప్పుడు అడపాద డప చర్చకు వస్తూనే ఉంది. ఈ విషయంలో అధికారులు తీరు ఒకలా ఉంది... భూమి మాదే పట్టా మా పేరు పై ఉంది హైకోర్టు మాకు పూర్తి హక్కులు కల్పించింది అంటూ పద్మలత పేర్కొంటున్నారు. అధికారులు గతంలో కుంట భూమి ఉంది దీని సర్వే చేయాలని ఒకరు సర్వే చేస్తామని మరొకరు ఇలా అధికారులు ఒకలా పట్టాదారులు మరోలా దొంగలకుంట భూభాగం పై చర్చ తీవ్ర రూపం దాల్చింది. 

అధికారులు ప్రెస్ మీట్ పెట్టి చెబితే తప్పేంటి..?

దొంగలకుంట భూభాగంపై అధికార యంత్రాంగం ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి వారికి సంబంధించిందే అని చెబితే తప్పేముందని కొందరు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. నిజమైన పట్టాదారులు అయితే దొంగలకుంట అనే పిలవబడే భూమి కట్ట తొలగింపు అర్ధరాత్రి ఎందుకు జరుగుతుందని అక్కడ ఉన్న స్థానికులు మంగళవారం తొలగింపుకు వచ్చిన వారితో వాగ్వివాదం పెట్టుకున్నారు. 

ఈ విషయంపై పట్టాదారురాలు సైతం స్పందించి మా భూమిలో మేము ఎప్పుడు చదును చేసుకుంటే ఎవరికి ఎందుకు నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. స్థానికులు మాత్రం ఎవరు చెబుతున్నది వాస్తవము.. ఎవరు చెబుతున్నది అవాస్తవము తేల్చాలంటే అధికారులు ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టి ఈ గుంటకట్ట పై పూర్తిస్థాయిలో వివరాలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

దొంగల కుంట భూమి సర్వే చేయాలని తాసీల్దార్‌కు లేఖ రాసిన ఇరిగేషన్ ఈఈ మనోహర్ 

దొంగలకుంట భూమి ఉంది. దాదాపు ఈ భూభాగము 12 ఎకరాల వరకు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎనిమిది ఎకరాల వరకు ఉం దని గత కొన్ని రోజుల క్రితం ఇరిగేషన్ ఈఈ మనోహర్ అర్బన్ తాసిల్దార్ ఘాన్సీరాం నాయక్ కు లేఖ రాసినట్లు మనోహర్ ప్రకటించారు. అసలు కుంటనే లేనప్పుడు దొంగ లకుంట భూభాగం ఉంది అని సర్వే చేయాలని ఈ మనోహర్ తాసిల్దార్ లేక ఎలా రాస్తారు అనే సందేహం కూడా నెలకొంది.

తాసిల్దార్ ఘాన్సీ న్సీరామ్ నాయక్ సైతం ఈ వివాదం ఉత్పన్నం కాకముందు నేరుగా మాట్లాడగా ఇరిగేషన్ ఈఈ మనోహర్ దొం గల కుంట భూభాగాన్ని తేల్చాలని హద్దులు కేటాయించాలని లేఖ రాసింది వాస్తవమే తెలిపారు. అసలు దొంగలకుంట భూమి ఉందా లేదా అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

కాగా అధికార యంత్రాంగం ఈ మేరకు చర్యలు తీసుకొని, పట్టణ వాసులకు నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తుందా లేదా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై బుధవారం ఇరిగేషన్ ఈ మనోహర్ కు ఫోన్ లో సంప్రదించగా స్పందించలేదు. కార్యాలయానికి వెళ్లినప్పటికీ సార్ అందుబాటులో లేరని చెప్పారు. 

కుంట కాదు కట్ట.. ఆ భూమి మాకే సొంతం..:  ఎస్.పద్మలత,  పట్టాదారురాలు

అసలు దొంగలు కుంట మా భూమిలో లేదని పట్టాదారురాలు ఎస్ పద్మలత అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని రోడ్ల భవనాల శాఖ అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కు టుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. సర్వే నెంబర్  151 లో దొంగలకుంట ఉండేదని మాది  సర్వేనెంబర్ 127 నుంచి సర్వేనెంబర్ 132 వరకు పూర్తిస్థాయిలో మాకు సంబంధించిన భూములని ఈ భూముల్లో ఎవరి జోక్యం సరికాదని తెలిపారు.

మా భూమిలో మేము కట్ట వేసుకుంటే పైకెళ్ళి నీరు వచ్చి అక్కడ చేరుకుంటే దాని పేరు దొంగల కుం ట అని పెట్టి అది మా భూమి కాదు అంటే ఎట్లా అని ప్రశ్నించారు. మాకు సంబంధించిన భూమిలో మా ఇష్టం వచ్చినప్పుడు మేము పనులు చేసుకుంటామని, ఎవరో వచ్చి చెబితే అప్పుడు మా భూమిలో మేము పనులు చేసుకోవాలా అంటు అసహనం వ్యక్తం చేశారు.

హైకోర్టు కూడా మా భూమికి సంబంధించి పూర్తిస్థాయిలో ఉత్తర్వులు మద్దతుగా ఇవ్వడం జరిగిందని తెలిపారు.  గతంలో మా భూమి క్రయవిక్రాయాల్లో భాగస్వామి అయిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్ కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఇది సరైన విధానం కాదని తెలిపారు.

మాకు సంబంధించిన భూములే 12 ఎకరాలు ఎంవీఎస్ కళాశాలకు ఇచ్చామని, మా భూములను మేము సరి చేసుకుంటుంటే ఎందుకు ఇలాంటి రాద్ధాంతాలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్  కూడా తెలియజేశామని, అందరి అనుమతి తీసుకొని మా భూమిలో మేము పనులు చేసుకుంటున్నామని దయచేసి ఎవరు మా భూమి జోలికి రాకూడదని కోరారు.