calender_icon.png 1 April, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా?

30-03-2025 12:42:53 AM

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ 

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వా రిపై కేసులు పెట్టడం దారుణమని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కు మార్ ఆరోపించారు. శనివారం తె లంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 15, 16 తేదీల్లోనే పదిహేను కేసులు న మోదు చేశారని, రీ ట్వీట్ చేసిన వారిపై కూడా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. అశ్లీలత మీద పెట్టాల్సిన సెక్షన్ 67 ఐటీ యాక్ట్‌ని ప్రయోగించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.

డిజిటల్ మోసాల నుంచి ప్రజలను కా పాడాల్సిన సైబర్ సెక్యూరిటీ బ్యూ రోను సీఎం రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని అధికారులు కొందరు సీఎం తొత్తులు గా పని చేస్తూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని, ఇలాంటివారిని వదిలిపెట్టమని హెచ్చరించారు.