calender_icon.png 6 November, 2024 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్లేసిన రైతుల బాధలు పట్టవా?

06-11-2024 12:07:50 AM

బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు

ఖమ్మం, నవంబర్ 5 (విజయక్రాంతి): ఓట్లేసి గెలిపించిన రైతుల బాధలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఖమ్మం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. మంగళవారం పత్తి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఖమ్మం పత్తి మార్కెట్‌ను తాతా మధు సందర్శించారు.

అనంతరం విలేకరులతో తాతా మధు మాట్లాడుతూ.. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన నేతలు, జిల్లా మంత్రులు రైతును చులకన చేస్తున్నారని దుయ్యబట్టారు. పత్తి మార్కెట్‌లో కేంద్రం ప్రకటించిన గిట్టుబాటు ధర రూ.7,521  దక్కడం లేదన్నారు.

సీసీఐ ద్వారా 9 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలుకు అవకాశం కల్పిస్తే నాలుగింటిలో మాత్రమే  పత్తి కొనుగోలు చేస్తున్నారని అన్నారు. సీసీఐ అధికారులు మిల్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సీసీఐని ఖమ్మం పత్తి మార్కెట్‌లో ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. 

సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి 

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుని ఖమ్మం మార్కెట్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ సీనియర్ జిల్లా నాయకులు ఆర్‌జేసీ కృష్ణ డిమాండ్ చేశారు. వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.