calender_icon.png 4 October, 2024 | 8:52 AM

సీజ్ చేసిన ఇసుక మాయం?

04-10-2024 12:00:00 AM

అధికారుల అండదండలతో అక్రమాలు  

పట్టుకునే వారే దొంగలకు సహకరిస్తే ఎలా అని చర్చ

విజయక్రాంతి’ ప్రతినిధిని చూసి జారుకున్న ఆన్‌లైన్‌లో లేని ట్రాక్టర్లు

మంచిర్యాల, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : కలెక్టరేట్‌కు సమీపాన ఉన్న సీతారాంపల్లి, తాళ్లపల్లి గ్రామాల్లో, శివారు వ్యవసాయ భూముల్లో, వెంచర్లలో పెద్ద మొత్తంలో ఇసుక డంపులున్నా మామూళ్లకు అలవాటు పడిన అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరం గా మారాయి.

పెద్ద సంఖ్యలో అక్రమ నిలువలుండగా ఫొటోలకు ఫోజులిచ్చి కొన్నిం టిని చూపి పోలీసులు చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు సక్రమం పేరిట సీజ్ చేసిన కుప్పలకు ఆన్‌లైన్ పేరిట ఇసుక తరలిస్తున్నామంటూ సీజ్ చేయని కుప్పలను కూడా తరలిస్తున్నారు.

బుధ వారం ఆన్‌లైన్‌లో ఆరు ట్రాక్టర్ల ద్వారా కేవ లం ఆరు ట్రిప్పులే (అధికారికంగా మాత్రమే) తీసుకెళ్లిన వారు.. గురువారం సైతం ఆరు వాహనాలే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. కానీ, అక్కడకు పదికిపైగానే వాహనాలు రాగా ‘విజయక్రాంతి’ ప్రతినిధిని చూసి ఆన్‌లైన్‌లో రాని వాహనాలు మెల్లగా జారుకున్నాయి. 

అధికారుల అండదండలు పుష్కలం 

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఇసుక డంపులు అని ఇటీవల ‘విజయక్రాంతి’ దినపత్రికలో ప్రచురితమైన కథనా నికి స్పందించిన పోలీసులు ఈ నెల ౧న ఇసుక డంపులను సీజ్ చేసినట్టు ప్రకటించారు. ఆ సమయంలో అక్కడ వేల సంఖ్య లో ట్రిప్పుల నిల్వ ఉండగా, ప్రస్తుతం అక్కడ రేవలం ౧౩౫ ట్రిప్పుల ఇసుక మ్రాతమే సీజ్ చేసినట్టు చెప్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో  ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గత రెండు రోజుల్లోనే వందల సంఖ్యలో ట్రిప్పుల ఇసుకను మాయం చేశారు. 

సీజ్ చేసిన ఇసుక మాయం 

రెవెన్యూ, మైనింగ్ అధికారులు, సిబ్బంది హడావిడి చేసి కేవలం 135 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక అక్రమ డంపులున్నాయని ప్రకటించి చేతులుదులుపుకున్నారు. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు ఇసుకను రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు మాయం చేశారు.

గురు వారం ఉదయం సీజ్ చేసిన ఇసుకను ఆన్‌లైన్ సాండ్ బుకింగ్ కింద తరలించేందుకు అక్కడకు వెళ్లగా రాత్రిళ్లు ఇసుకను తరలించడంతో ఇసుక మాయం కాగా చివరకు తడి మాత్రమే దర్శనమిచ్చింది. ఈ విషయమై అక్కడ విధుల్లో ఉన్న ఎస్‌ఆర్‌ఓను అడగగా ఆ కుప్పలు మేం సీజ్ చేయలేదనడం కొసమెరుపు.

పట్టుకునే వారే దొంగలకు సహకరిస్తే..  

ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ యాజమానులకు సంబంధిత శాఖ అధికారులు సహకరిస్తే ఎంత ఇసుకనైనా ఇలా మాయం చేస్తారనడంలో బుధ వారం రాత్రి మాయం చేసిన ఇసుక కుప్పలే నిదర్శనంగా చెప్పవచ్చు.

మరోవైపు ఊరంతా ఇసుక నిలువలే ఉండగా కేవలం ఊరి ఆవలి వైపున ఉన్న వాటిని మాత్రమే సీజ్ చేయడం, ఇంటి వద్ద ఉన్నవాటిని రెవె న్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దొంగలను పట్టుకునే పోలీసులే దొంగలకు సహకరిస్తే ఎలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డబ్బులకు మరిగి అవినీతిని అధికారులు ప్రోత్సహిస్తుండటంతో తప్పు చేస్తున్న అక్రమార్కులకు రాత్రిళ్లు డంప్‌లకు, పగ లు అమ్మకాలు యథేచ్ఛగా జరుపుతున్నారు.