calender_icon.png 30 January, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాలు కొందరికేనా?

29-01-2025 12:14:07 AM

  1. పైలట్ గ్రామంలో అర్హులకు అందని సంక్షేమ ఫలాలు 
  2. ప్రచారానికే పరిమితమైన ప్రభుత్వం
  3. ఆందోళన చెందుతున్న అర్హులు

కోనరావుపేట, జనవరి 28: ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పిన ప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సాధ్యం కావ డం లేదు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ గ్రామంలో గడపగడపకు నాలుగు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎంతో గొప్పగా కార్యక్ర మాన్ని చేపట్టారు.

కానీ అనుకున్న విధంగా లబ్ధిదారులకు ప్రభుత్వ నాలుగు పథకాలు అందజేయడంలో మొండి చేయి ప్రదర్శిం చారు. ఆ నాలుగు పథకాల్లో కొందరికి మా త్రమే ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోవడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు పథకాలైన  రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కా ర్డులు అందిస్తానని హామీ ఇచ్చి మరోసారి మొండిచెయ్యి చూపింది.

కోనరావుపేట మండలంలోని కొలనూర్ గొల్లపల్లి గ్రామా న్ని నాలుగు పథకాల అమలు కోసం పైలెట్ గ్రామం క్రింద ఎంపిక చేసింది. ఈ గ్రామం లో మహిళలు 238, పురుషులు 232 మంది మొత్తంగా 488 మంది జనాభా ఉ న్నారు. ఇందులో స్థలం ఉండి ఇల్లు లేని 89 మంది ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసు కోగా 30 మందికి మంజూరు చేసింది.

కానీ లబ్ధిదారులకు ఎలాంటి ప్రొసిండింగ్ పత్రాల ను అందించలేదు. అలాగే గుంట భూమి లేక ఉపాధి పనికి ఇరువై రోజులు వెళ్లిన కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 18 మందిని సర్వే ద్వారా ప్రభుత్వమే ఎంపిక చేసింది. కానీ ఎఒక్కరికి కూడా తమ ఖాతాలో డబ్బులు జమకాలేదు. రేషన్ కార్డు కోసం 21 మంది దరఖాస్తు చేసుకోగా 20 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు పేర్కొన్నారు.

ఇక రైతు భరోసా పథకం క్రింద 82 మంది రైతులు గాను 188 ఎకరా ల సాగు భూమి ఉంటే 11లక్షల 18వేల 250 రూపాయలు జమతాయని రైతులకు చెప్పా రు. ఇప్పటి కొంత మందికి మాత్రమే రైతు భరోసా పైసలు జమకాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి లబ్ధిదారులకు మొండిచెయ్యి చూపడంతో రైతులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలె...

జా గుండు ఇల్లు లేని వారికి ఇంద్ర మైండ్లు ఇస్తామని అందరూ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పినప్పటికీ పలుమార్లు దరఖాస్తు చేసుకున్న నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదని అధికారులు ఆడితే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు. మిగతా వాళ్ళందరికీ ఇండ్ల మంజూరు ఇచ్చినప్పటికీ నాకు మాత్రం అధికారులు మొండి చేయి చూపారు.

 మ్యాక లాస్య 

రైతు భరోసా ఇయ్యలేదు 

నాకు ఊరిలో రెండు ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి పంట సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మా గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని రైతు భరోసా అందరికీ వేసినప్పటికీ నాకు మాత్రం ప్రభుత్వం వేయలేదు. అధికారులు ఆడితే ఇదిగో రెండు, మూడు రోజుల వేస్తారు అని మాయమాటలు చెబుతున్నారు.

 కలకుంట్ల నరేందర్, రైతు