calender_icon.png 28 September, 2024 | 6:52 AM

శ్రీశైలం నిర్వాసితుల సమస్యలు పట్టవా?

28-09-2024 02:17:09 AM

మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): శ్రీశైలం నిర్వాసితుల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు శ్రీశైలం నిర్వాసితులకు అన్యాయం చేశాయని ఎన్నిక లప్పుడు రేవంత్ ఘాటుగా ఆరోపించారని, శ్రీశైలం నిర్వాసితుల్లో 78 మందికి కేసీఆర్ ప్రభుత్వం లష్కర్లు గా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.

రేవంత్ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినా అది నెరవేరడం లేదని, పాలమూరు జిల్లాకు మంత్రులు గాలి మోటర్లలో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్లారని ఎద్దేవా చేశారు. వెంటనే శ్రీశైలం నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా మంత్రులు తమ సొంత పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, హైదరాబాద్ నుంచి నల్లగొండ తిరుగుతున్నారు తప్ప ఏ సమస్యలు పట్టించుకోవడం లేదనారు.

దని మండిపడ్డారు. మిషన్ భగీరథ మంత్రి కోమటిరెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. మాజీ  ఎమ్మెల్యే జాజల సురేందర్ మాట్లాడుతూ గ్యారెంటీలపై గాలి మాటలు చెప్పి కాంగ్రెస్ నేతలు తప్పించుకుంటున్నారని, కేసీఆర్‌పై విమర్శలు తప్ప రేవంత్ సాధించిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ హామీలపై ప్రజలు నిలదీస్తున్నారని, ముందు వాటిపై సీఎం దృష్టి పెట్టాలని సూచించారు.