calender_icon.png 21 February, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్కరకు రానోళ్లకు అందలమా?

19-02-2025 01:29:22 AM

* కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రసాబాస

* మనసులో మాటను కుండబద్దలు కొట్టిన కార్యకర్తలు 

* విస్తుపోయిన నేతలు

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): నాగర్ కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ పరిపాలన తీరు పట్ల గ్రామీణ ప్రాం త కార్యకర్తలు తమ మనసులోని దాచుకున్న ఆక్రొషాన్ని వ్యక్త పరుస్తూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కుండ బద్దలు కొట్టారు. మం గళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫం క్షన్ హాల్ లో నిర్వహించిన బిజినపల్లి మం డల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలు వురి నేతలపై కార్యకర్తలు కుర్చీలెత్తి దాడికి యత్నించారని విశ్వసనీయ సమాచారం.

దీంతో వేదికపై కూర్చున్న ముఖ్య నేతలు ఇరువురూ విస్తు పోయారు. తమ అభిమాన నేతల పట్ల, పార్టీ జెండా పట్ల ప్రేమ మమ కారం మనసులోనే దాచుకుని ఓు్ంప సహ నంతో నెట్టుకొస్తున్నామని అర్ధ రూపాయకు అక్కరకు రాని వాళ్లను కూడా అందలం ఎక్కించి పక్కనే కూర్చోబెట్టుకొని ఊరేగు తుండడంతో పార్టీ పరువు బజారుకుతోం దని ఆవేదన చెందారు. పార్టీ కోసం నేతల కోసం కష్టపడి పనిచేసి గెలిపించిన తమను మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు.

వట్టెం, అల్లిపూర్ రెండు గ్రామాలకు మాత్రమే అత్యధిక నిధులు కేటా యిస్తూ మిగతా అభివృద్ధిలో వెనుకబడిన గ్రామాలను పూర్తిగా మర్చిపోయారా అం టూ మండిపడ్డారు. ఓ ఇద్దరు నేతలు మా త్రమే మిగతా కార్యకర్తల పట్ల పెత్తనాన్ని చెలాయిస్తూ పార్టీని నేతలను తప్పుదారి పట్టించి వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తున్నారని అయినా వారికే నేతలు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల లోలోపలే రగిలిపోతున్నట్లు తమ మన సులో మాటను బయటపెట్టారు.

ఈ సంద ర్భంగా స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇరువురూ కార్యకర్తలను సముదాయిస్తూ ఇకనుంచి అందరికీ సమానంగా ప్రాధాన్యత కల్పించడంతోపాటు అన్ని గ్రామాల్లోనూ అభివృద్ధి జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు శాంతించిన ట్లు తెలిసింది. దీంతో కొద్దిసేపు రస బస కొనసాగి తీవ్ర గందరగోల వాతావరణం నెలకొంది. ఇదే వ్యవహారం అన్ని మండలా ల్లోనూ కొనసాగుతోందని ఆయా మండలా ల ముఖ్య నేతలు తమ మనసులో మాటను బయట పెడుతుండడం విశేషం.