జగిత్యాల అర్బన్, జనవరి 31: పయాగ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లిన జగిత్యాలకు చెందిన ఇద్దరు మహి ళలు గల్లంతయినట్టు సమాచారం. వీరితో పాటూ నిర్మల్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు మహిళల ఆచూకి కూడా లభ్యం కాకపోవ డంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందు తున్నారు.
జగిత్యాలలోని కొత్త వాడకు చెందిన ఆది రాజవ్వ(55) విద్యానగర్‌కు చెందిన వీర్ల నరసవ్వ(55) నిర్మల్ జిల్లా కడెంకు చెందిన మరో 8 మంది మహిళలు ఈనెల 27న ట్రావెలర్ బస్సులో కుంభమే ళాకు వెళ్లారు. 29న ప్రయాగరాజ్ చేరుకు న్నారు. ట్రావెలర్ బస్సును పార్కింగ్ స్థలం వద్ద నిలిపి వేయడంతో అక్కడి నుండి రెండు ఆటోలలో వెళ్లారు.
కుంభమేళాలో పవిత్ర స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత ఒక ఆటోలో వెళ్లిన ఆరుగురు మహిళలతో పాటూ మరో ఆటోలో వెళ్లిన ఇద్దరు తిరిగి వచ్చారు. జగిత్యాలకు చెందిన ఆది రాజవ్వ, వీర్ల నరసవ్వలు, కడెంకి చెందిన బెల్లపు సత్యవ్వ, ఏనుగుల బుచ్చవ్వల ఆచూకి లభ్యం కాలేదు. తప్పిపోయిన వీరంతా సమీ ప బంధువులు, ఈ కుటుంబాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
వీరికి సంబంధిం చిన సెల్ ఫోన్లు కూడా మిగిలిన వారి వద్దనే ఉండడంతో తప్పిపోయిన వారికి సంబం ధించి ఎలాంటి సమాచారం లభించడం లేదు. మహిళలు గల్లంతైన విషయాన్ని జగి త్యాలలోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈనెల 29న కుంభమేళాలో జరిగి న తొక్కిసలాటలో తప్పిపోయారా? లేక మ రేదైన సంఘటన జరిగిందా అనే విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెం దుతున్నారు. తప్పిపోయిన వారికు టుంబ సభ్యులు శుక్రవారం యూపీకి వెళ్ళారు.