15-07-2024 12:05:00 AM
ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా? కళ్లు, గోళ్లు తెల్లగా మారుతున్నా యా? ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇవి రక్తహీనత ప్రధాన లక్షణాలు. విటమిన్ బి12 లోపం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. శరీరంలో ఉండే ముఖ్యమైన పోషకాలలో విటమిన్ బి12 ఒకటి. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడతుంది. శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల ఎముకలు, కండరాలు, మానసిక స్థితి, మెదడు సమస్యలకు దారి తీస్తుంది. అలా కాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో విటమిన్ బి12 సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అలావాటు చేసుకోండి.