- మహారాష్ట్రలో అంచనాలకు మించి కమలానికి పట్టం
- జార్ఖండ్‌లో డీలా పడ్డ ఎన్డీయే కూటమి
న్యూఢిల్లీ, నవంబర్ 23(విజయక్రాంతి): హర్యానాలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ప్రజలు పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
మరాఠ్వాడలో 288 అసెంబ్లీ స్థానాలకుగాను 182 స్థానాల్లో ఎన్డీఏ కూటమి పాగా వేస్తోందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. ఇండియా కూటమి 97 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఏబీపీ మ్యాట్రిజ్ బీజేపీ కూటమికి 150-170 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 110-130 స్థానాలు వస్తాయని వెల్లడించింది.
పీ మార్క్, చాణక్య స్ట్రాటజీస్, పోల్స్ డైరీ, లోక్‌శాహీ మరాఠీ, పోల్స్ ఆఫ్ పోల్స్ లాంటి సంస్థలు ఏన్డీఏ కూటమికి పట్టంకట్టాయి. ఎలక్టోరల్ ఎడ్జ్, దైనిక్ భాస్కర్ లాంటి కొన్ని సంస్థలు ఏన్డీయే కూటమి కంటే ఇండియా కూటమి అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. కానీ అన్నీ సర్వేల ఫలితాలను తలకిందులు చేస్తూ ఏన్డీయే కూటమి 23౪ స్థానాలను కైవసం చేసుకుంది.
అందులో 13౨ స్థానాలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవగా, శివసేన 57 స్థానాల్లో, ఎన్సీపీ 41 స్థానాలను కైవసం చేసుకున్నాయి. మహావికాస్ అఘాడీ మాత్రం ఏమాత్రం ప్రభావితం చూపకుండా చతికిలా పడింది. ఇండియా కూటమి కేవలం 49 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌కు 1౬ స్థానాలు, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే)కు 20, ఎన్సీపీ (శరద్‌పవార్ వర్గం)కి 10 సీట్లు దక్కాయి.
గిరిజన సిఖలో సీన్ రివర్స్
జార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. అధికార జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి ఓటమి తప్పదని సర్వే సంస్థలు ముక్తకంఠంతో పేర్కొన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాల్లో బీజేపీ కూటమికి 46 నుంచి 58 సీట్లు దక్కుతాయని పీపుల్స్ పల్స్, 42 నుంచి 47 స్థానాల్లో పాగా వేస్తుందని ఏబీపీ మ్యాట్రిజ్, 45 నుంచి 50 స్థానాల్లో విజయం సాధిస్తుందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేశాయి.
పోల్స్ ఆఫ్ పోల్స్, టైమ్స్ నౌ తదితర సర్వే సంస్థలు కూడా బీజేపీ కూటమికే పట్టంగట్టాయి. యాక్సిస్ మై ఇండియా లాంటి కొన్ని సంస్థలు మాత్రం కాంగ్రెస్ కూటమి అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. సర్వే సంస్థల ఫలితాలను తలకిందులు చేస్తూ జార్ఖండ్ ప్రజలు అధికార జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టారు.
మొత్తం 81 స్థానాల్లో ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించగా, ఏన్డీయే కూటమి కేవలం 24 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక చోట జార్ఖండ్ లోక్‌తంత్ర అనే పార్టీ విజయం సాధించింది.