- వాస్తవ పరిస్థితిపై అఫిడవిట్ ఇవ్వండి
- ఇరుపక్షాలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): రామమ్మకుంట చెరువు ఎఫ్టీఎల్ ప రిధిలో నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టూ రిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించారా? లేదా అన్న అంశాన్ని ఇటు పిటిషనర్‌తోప టు ప్రభుత్వం కూడా వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని గురువారం హైకోర్టు ఆదేశించింది.
అక్రమ నిర్మాణాలను తొలగించామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ నివేదికలో పేర్కొనగా, తొలగించలేదంటూ పిటిషనర్ చెప్తుండటంతో వారి వాదనలను ధ్రువీకరించేలా ఆధారాలతో అఫిడవిట్లు దా ఖలు చేయాలని ఆదేశించింది. తప్పుడు వివరాలు అందించినవారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
రామమ్మకుంటలో అక్రమ నిర్మాణలు చేపడుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హ్యూమన్ రైట్స్ అండ్ కన్సూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ దాఖలుచేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జ స్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు తో కూడిన ధర్మాసనం గురువారం విచార ణ చేపట్టింది.
ఇందులో ఆక్రమణలను తొలగించామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమర్పించి న నివేదికలో పేర్కొనగా అసలు ఆక్రమణల ను తొలగించలేదని పిటిషనర్ తరఫు న్యా యవాది ధర్మాసనం దృష్టికి తీసుకురాగా గడువు ఇస్తే ఆధారాలను సమర్పిస్తానన్నా రు. దీంతో ధర్మాసనం ఇరుపక్షాలకు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచార ణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఎఫ్టీఎల్ నిర్ధారణపై ప్రత్యేకంగా విచారిస్తాం
హెచ్‌ఎండీయే పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించిన వివాదంపై ప్రత్యేకంగా విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశాన్ని సుమోటో పి టిషన్‌గా తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆ దేశించింది.
రామమ్మకుంట ఆక్రమణల తొ లగింపు వ్యవహారంలో జూలై 24న కోర్టుకు హాజరైన హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ హెచ్‌ఎండీఏ పరిధిలో 3,532 చెరువులున్నాయని, 230 చెరువులకు ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు. 2525 చెరువులకు ఎఫ్‌ఎటీల్‌ను గుర్తిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశామని, మూడు నెలల్లో తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.