calender_icon.png 7 November, 2024 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలా?

04-11-2024 02:35:38 AM

  1. చర్చి, మసీదుల్లో కోఆర్డినేటర్లను నియమించే దమ్ముందా!
  2. పీసీసీ చీఫ్ లేఖపై స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): హిందూ ఆలయాలు విశ్వాసాలకు నిలయాలని, వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. రాష్ట్రంలోని ఆలయాల కమిటీలు, ట్రస్ట్ బోర్డుల్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించాలని కోరుతూ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ..

రాష్ట్ర దేవాదయ శాఖ మంత్రి కొండా సురేఖకు రాసిన లేఖపై బండి సంజయ్ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. రాజకీయ ప్రమేయం లేని వ్యక్తులను దేవాలయాల్లో నియమించి ఆలయాల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ చేపట్టే చర్యల వల్ల దేవాలయాల్లో ఆధ్యాత్మిక దెబ్బతింటుందని బండి సంజయ్ మండిపడ్డారు.

చర్చి, మసీదుల్లో కోఆర్డినేటర్లను నియమించే దమ్ముందా.. లేక కేవలం హిందువుల దేవాలయాల్లో మాత్రమే నియమించబోతున్నారా అని ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలను పరిరక్షించడం, ఆలయాలపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.