calender_icon.png 25 October, 2024 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా పట్టాదా?

29-08-2024 12:00:00 AM

అధికారులపై హైదరాబాద్ కలెక్టర్ ఫైర్

హైదరాబాద్ సిటీబ్యూరో/ముషీరాబాద్, ఆగస్టు 28: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా పారిశుద్ధ్య నిర్వహణ పట్టాదా అని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జీహెచ్‌ఎంసీ సర్కిల్ అధికారులపై మండిపడ్డారు. బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఆర్‌టీ కాలనీ, ఆజామాబాద్ ప్రాంతాలను కలెక్టర్ సందర్శించారు. ఎస్‌ఆర్‌టీ కాలనీ సమీపంలోని వ్యర్థాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. పారిశుధ్యం లోపిస్తే వ్యాధులు రావా అని డిప్యూటీ కమిషనర్ ఖాధర్ మోహినుద్దీన్, సహాయ వైద్యాధికారి హేమలతను ప్రశ్నించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వీడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనవెంట రాంనగర్ కార్పొరేటర్ రవిచారి, సికింద్రాబాద్ ఆర్డీవో దశరథ్‌సింగ్ ఉన్నారు. 

పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం స్థల పరిశీలన

హైదరాబాద్‌లో పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం కలెక్టర్ అనుదీప్ స్థల పరిశీలన చేశారు. గోషామహల్‌లోని పోలీస్ శాఖకు చెందిన భూమిలో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధ వారం అడిషనల్ డీసీపీ ఎన్ భాస్కర్, ఇన్‌చార్జి ఆర్డీవో జ్యోతితో కలిసి బహుదూర్‌పుర పేట్ల బురుజులో ఉన్న పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీలో స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.