calender_icon.png 21 November, 2024 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కామ్‌లు దర్యాప్తులకే పరిమితమా?

21-11-2024 12:00:00 AM

తెలంగాణ సెంటిమెంట్‌తో అధికా రం పొంది తొమ్మిదిన్నరేళ్లకు పైగా కుటుంబ నిరంకుశ పాలనతో అన్ని రంగాల్లో అవినీతి, దోపిడీ పెంచి పోషించి ప్రజల ఆశలను అడియాసలు  చేసిన కారణంగా ప్రజలు కల్వకుంట్ల కుటుంబ పార్టీ ని ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. రాష్ట్రాన్ని దోచుకున్న నాయకుల ను, అవినీతి అధికారులను కొత్త ప్రభుత్వం తగిన విధంగా శిక్షిస్తుందని ప్రజలు ఆశించారు.

అధికారం అడ్డం పెట్టుకొని అవినీ తి, అక్రమాలతో కుటుంబ సభ్యులు, కొంతమంది సమీప బంధువుల ఆస్తులు లెక్కకులేని స్థాయికి ఎదిగిపోయాయనేది  జగమెరిగిన సత్యం.  సొంత పత్రికలు, టీవీ ఛానళ్లు, ఫామ్‌హౌస్‌లు, ఎస్టేట్లు, బినామీలపై వందల, వేలకోట్ల విలువైన లెక్కకులే నన్ని భూములు, కార్పొరేట్ సంస్థలు, ఇంకా ఎన్నెన్నో ఆస్తులు సొంతం చేసుకోగలిగారు. 2011లో ఇందిరమ్మ ఇండ్ల పథ కం కింద ఇంటి స్థలాన్ని పొందిన ఒక బం ధువు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వందల కోట్ల రూపాయల ఆస్తిపరుడు ఎలా అయ్యారు?

ప్రజలకు వాగ్దానం చేసిన డబుల్ బెడ్‌రూం గృహాలు, దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి, ఉద్యమకారులకు, నిరుద్యోగులకు న్రెలకు 3000 రూపాయల పారితోషికం, బీసీ బంధు, కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య, వెనుకబడిన కులాల విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ మొదలైన హామీలు గాలికి వదిలి విద్య, వైద్య ,ఉపాధి రంగాలను కోలుకోలేని స్థాయికి విధ్వంసం చేసిన చరిత్ర కల్వ కుంట్ల పాలకులది అని ప్రజలు సంపూర్ణం గా అర్థం చేసుకున్నారు.  

సర్కార్‌ను అస్థిరపరిచే కుట్ర

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అపరచాణక్యుడు. తన వాక్చా తుర్యముతో ప్రజలను రంజింప చేయగలరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో విధంగా అస్థిర పరచాలని ఉవ్విళ్లూరుతున్నారు. అబద్ధపు ప్రచారాలతో వ్యతిరేక వాతావరణ సృష్టించడానికి అల్లుడు, కుమారుడ్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతర దాడికి వదిలిపెట్టారని తెలంగాణ ఉద్యమకారులు, బుద్ధి జీవులు చర్చించుకుంటున్నారు.

కుటుంబ పార్టీని పటిష్ఠం చేసి వారసత్వ రాజకీయాలను కొనసాగించాలని కేటీఆర్, తన్నీరు హరీష్ రావులు నిత్యం తమ సొం త ప్రచార మాధ్యమాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు.‘ఇందుగలడందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అం దందు కలడ’ని పురాణాల్లో  చెప్పినట్లుగా నే కల్వకుంట్ల వారి పాలనలో అన్ని వ్యవస్థలలో, సంస్థలలో అవినీతి తారాస్థాయికి చేరిన విషయాన్ని ప్రజలు 9 సంవత్సరాల కు పైగా ప్రత్యక్షంగా గమనించారు.

అనుభవించి నష్టపోయారు.సహజ వనరులను, భూములను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి వేల కోట్ల రూపాయల ఆస్తులు సం పాదించుకున్న కుటుంబమే అధికారం పోయిన కొద్ది నెలలకే రోడ్డున పడి అవాకులు, చవాకులు మాట్లాడుతుంటే  ప్రజ లు ముక్కున వేలు వేసుకుంటున్నారు. 

కాళేశ్వరం నుంచి గొర్రెల స్కామ్ దాకా..

కల్వకుంట్ల కుటుంబీకులు రాష్ట్రంలోఅనేక కుంభకోణాలకు తెరలేపినట్టుగా దర్యా ప్తు సంస్థల ద్వారా అనేక వార్తా కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలతో అన్నీ తానై అవినీతి లక్ష్యంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి నిరర్థకంగా, మ్యూజియం వస్తువుగా మిగిలిపోయింది. అదేవిధంగా భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్రాజెక్టులు కాలచెల్లిన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించి తెలంగాణ ప్రజలపై నిరంతర ఆర్థిక భారం మోపడం జరిగింది.

హైదరాబాద్,- రంగారెడ్డి జిల్లాలోని విలువైన ప్రభుత్వ సర్ఫేఖాస్ భూములు వేలా ది ఎకరాలుగా అన్యాక్రాంతం అయ్యాయ ని వార్తలు విలువడుతున్నాయి. ఓఆర్‌ఆర్ 30 సంవత్సరాల లీజు వ్యవహారం మరో కుంభకోణం. దశాబ్ద కాలంగా రైస్ మిల్లు లు, అధికారంలో ఉన్న నాయకులు కుమ్మక్కై వేలకోట్ల స్కాములకు పాల్పడ్డ పాలకులను శిక్షించాలని తెలంగాణ ప్రజ లు కోరుకుంటున్నారు.

గొర్రెల కొనుగో లు, పంపకంలో 700 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి అధికారులను, నాయకులను ప్రజా స్వామ్య ప్రభుత్వంలో ప్రజల ముందు నిలబట్టవలసిన అవసరం లేదా అని  ప్రశ్ని స్తున్నారు. సినిమా తారలు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ దిగ్గజాల  ఫోన్ టాపింగ్ వ్యవహారం, అవినీతి అధికారుల అండదండలతో ధరణి ద్వారా వేలాది ఎకరాల భూముల అక్రమ బదిలీలు.. ఇంకా అనేక కుంభకోణాలపై గత పది నెలల నుండి అనేక రకాల దర్యాప్తులు జరుగుతూనే ఉన్నాయి. 

ఈ అక్రమార్కుల పట్ల ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు  ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోవడం  తెలంగాణ ప్రజలను ఆశ్చర్య పరు స్త్తోంది.  కేవలం 360 కోట్ల రూపాయల దాణా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్, ఆయన సతీమణి రబ్రీదేవి జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. యూపీఏ ప్రభుత్వంలో తమిళనాడుకు చెందిన కనిమోళి, రాజా  కొంత కాలం జైలు జీవితం గడిపివచ్చారు.

కామన్వెల్త్, తదితర కుంభకోణాల్లో ఆనాటి కేం ద్ర మంత్రులు కూడా జైలుశిక్ష అనుభవించారు. సాధారణ ఆర్థిక స్థితిగతులను అను భవించిన వ్యక్తులు కూడా గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల ఆస్తిపరులుగా అవతరించారని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.ఇన్ని రకాల అవకతవకలు, దోపిడీ స్కాములలో పాలుపంచుకున్న రాజకీయ నాయకులు, కార్పొరేట్ సంస్థల దిగ్గజాలు, అవినీతిపరులైన అధికారులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టకుంటే, ఈ ప్రజాస్వామ్యంలో  ఎంత దోపిడీ చేసుకు న్నా తగిన శిక్ష పడని పక్షంలో ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని దోపిడిదారులను అరికట్టడం సాధ్యం కాదని ప్రజలకు అనుమానాలు రేకెత్తించవచ్చు. 

ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన నాయకులను, అధికారులను తగిన విధంగా శిక్షించకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. ఈ సంపన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన పాపం ఎవరిది? గత ప్రభుత్వం తప్పిదాలు, నియంత్రణ లేని అవినీతి, అక్రమాల వల్ల ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయేకపోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు, పెన్షన్లు, కరువు భత్యం వాయిదాలు సరైన సమయంలో చెల్లించలేని దుస్థితి ఎదుర్కొంటున్నది.

అధికారం రాగానే నాయకు లు, కార్పొరేట్ సంస్థలు, అవినీతి అధికారులు కుమ్మక్కై ఎవరికి తోచినంత వారు క్రోనీ క్యాపిటలిజం తరహాలో దోచుకోవడం, దాచుకోవడం నిరంతరం ఆనవా యితీగా మారితే ప్రజలకు ఈ ప్రజాస్వా మ్యం పట్ల నమ్మకం సన్నగిల్లుతుంది. పేదలను నిరంతరం ఉచితాల పంపిణీ, అందీ అందని, చాలీచాలని సంక్షేమ పథకాలకే  పరిమితం చేస్తే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని తెలంగాణ ఉద్యమకారులు, బుద్ధి జీవులు సామాజిక వేత్త లు ఆందోళన చెందుతున్న పరిస్థితి. 

రాష్ట్ర వనరులు ప్రజలందరికీ ఉపయోగించినప్పుడే  సుస్థిరమైన అభివృద్ధిని ఇస్తుందని పాలకులు గుర్తించాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును,వనరులను దోచుకున్న  నాయకులు,  అధికారులు, వ్యక్తులు, సంస్థకు సరైన శిక్ష  విధించనిదే మన ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అధికార మార్పిడి అంటే కేవ లం నాయకుల మార్పిడి మాత్రమే అవుతున్నదని ప్రజలు భావించే పరిస్థితులు రాకూడదు. దర్యాప్తులన్నీ అతి తొందరగా పూర్తిచేసి దోషులైన నాయకులను అవినీతి అధికారులను తగి న విధంగా శించి బుద్ధి చెప్పాల్సిన అవసరాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.

-ప్రొ.కూరపాటి వెంకట్ నారాయణ