calender_icon.png 10 April, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ కార్యాలయంలోకి విలేకరులకు అనుమతి లేదా?

28-03-2025 01:00:02 AM

-కార్యాలయంలోకి అనుమతి తీసుకుని రావాలని స్టిక్కర్ ఏర్పాటు..

కంగ్టి, మార్చి 27: కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లోకి విలేకరులకు అనుమతి లేదని, తహసీల్దార్ అబ్దుల్ నజీబ్ ఖాన్ మెయిన్ ఎంట్రీ డోర్ కు రెండు వైపులా విలేకరులు అనుమతి తీసుకుని లోపటికి రావాలని స్థిక్కర్లు స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడు లేనట్టుగా ఇలా పెట్టడము విలేకరులను అవమానపరిచేలా ఉందని, విలేకరులు తహసీల్దార్ ను కోరగా నా ఇష్టం అని సమాధానం ఇచ్చారు. విలేకరుల విలువలను అవమానం పరచడమే, తహసిల్దార్ వ్యవహారము ఉందని పలు వురు తెలిపారు .

తహశీల్దార్ కార్యాలయం కు వెళ్లిన విలేకరులను పోలీస్‌లకు ఫోన్ చేసి కార్యాలయం నుండి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారు. మారుమూల ప్రాంతంలో ఉన్న కంగ్టి విలేకరులు ప్రజలపై జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని నిలదీస్తూ ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాస్తూ బయటి సమాజానికి తెలుపుతున్న విలేకరులను కార్యాలయం లోనికి రాకుండా అడ్డుకుంటున్నారని పలువురు ఆరోపించారు. తాసిల్దార్ తన అవినీతి అక్రమాలు బయటకు రా కుండా విలేకరులను అడ్డుకుంటున్నారని పలువురు ఆరోపించారు.

స్టిక్కర్లు తొలగింపు..

నారాయణ ఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తి ని ఫోన్ లో వివరణ కోరగా ఇలా స్టిక్కర్లు పెట్టడం ఎవరికీ అధికారం లేదన్నా రు. వెంటనే స్టిక్కర్ లు తొలగించేలా తహసీల్దార్ ను ఆదేశించారు. ఆర్డీవో ఆదేశాలతో తాసిల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన స్టిక్కర్ లను తొలగించారు.