- ఒవైసీ ఫాతిమా కాలేజీని కూల్చివేస్తేనే సీఎం రేవంత్ హీరో.. లేదంటే ఫెయిలే
- గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఒవైసీ బ్రదర్స్ బెదిరింపుల కారణంగానే చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజీని కూల్చివేయడం లేదని, ఎప్పుడైతే ఫాతిమా కళాశాలను కూల్చివేస్తారో.. అప్పడు మాత్ర మే సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు హీరో అవుతారని.. లేదంటే ఫెయిల్ అయినట్టేనని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సున్నం చెరువు ఆక్ర మణలను ఆదివారం హైడ్రా అధికారులు కూల్చివేసిన సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడి యాలో వైరల్ అయ్యింది. హైదరాబాద్ నగరంలో ఒవైసీ బ్రదర్స్ ల్యాండ్ జిహాద్‌ని ఏర్పాటు చేసి చెరువులను, ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారని తీవ్రస్థాయిలో ఆరో పించారు.
ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చినా.. ఎందుకు కూల్చివేతలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని, హైడ్రా అధికారులను ప్ర శ్నించారు. అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరింపులకు భయపడి ఫాతిమా కాలేజీని కూల్చివేయడం లేదా? అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. చెరువుల పరిరక్షణ పేరుతో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలను హైడ్రామాగా అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఒవైసీ సోదరులతో కాంప్రమైజ్ అయ్యారా? లేదంటే, వారికి భయపడ్డారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సున్నం చెరువు వద్ద పేదల ఇళ్లను కూల్చడానికి పెద్దపెద్ద జేసీబీలు దొరుకుతాయి కానీ, ఫాతిమా కాలేజీని కూల్చడానికి ఎందుకు దొరకడం లేదు? అని ప్రశ్నించారు.
ఒవైసీ ఫాతిమా కళాశాలను ఎప్పటివరకైతే కూల్చరో.. అప్పటివరకూ మీరు ఫెయిల్ అయినట్టే అని సీఎంని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒవైసీ కళాశాలను ఎప్పుడు కూల్చుతారో? అని ప్రజలు డేట్ అడుతున్నారని, అందుకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వచ్చిన ఎంతోమంది ముఖ్యమంత్రులు ఒవైసీ బ్రదర్స్‌కు భయపడటం వల్లనే అనేక ప్రభుత్వ భూములు కబ్జా చేశారని విమర్శించారు.