calender_icon.png 11 February, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశలు అడియాశలేనా?

10-02-2025 12:54:22 AM

  • రేషన్ కార్డు ఆశావహులకు తప్పని ఎదురుచూపులు..? 
  • అధికారిక వెబ్‌సైట్‌లో మాడ్యూల్ మూసివేత
  • మీసేవ కేంద్రాల చుట్టూ లబ్ధిదారుల చక్కర్లు
  • వెబ్‌సైట్ ఓపెన్ అయితేనే ఏమైనా చేయగలమంటున్న మీసేవా కేంద్రాల నిర్వాహకులు

వనపర్తి, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : కేంద్ర రాష్ర్ట ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందాలంటే అన్నిటికి ఒకటే అదే రేషన్ కార్డు. అలాంటి రేషన్ కార్డు కోసం ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా ఐదు సంవత్సరాలుగా ఎదురు చుసిన ఎదురు చూపులే మిగిలాయి. రేషన్ కార్డులో ఏండ్లుగా కొత్తవారి పేర్లు నమోదు కాకపోవడంతో అసలు రేషన్ కార్డులు వస్తాయా రావా అని లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.

గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ప్రక్రియ ముందుకు సాగక పోవడం కనీసం ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డులు వస్తాయి అని లబ్ధిదారులు అనుకున్నారు. రేషన్ కార్డు కోసం లేని వాళ్ళందరు వార్డు, గ్రామసభలో దరఖాస్తులు నింపి అధికా రులకు ఇచ్చారు. ఇటీవల జనవరి నెలలో జరిగిన వార్డు, గ్రామసభలో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అని లిస్ట్ లో పేర్లు రాని వాళ్లు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు, నాయకులు చెప్పిన విషయం అందరికి తేలిసిందే.

ఈనెల 7న రాత్రి మీ సేవ కేంద్రంలో అధికారిక వెబ్ సైట్ ఓపెన్ గంటల వ్యవధిలోనే మాడ్యూల్ మూసేశారు. రేషన్ కార్డు లేనివాళ్లు, కొత్త పేర్లను ఎంట్రీ చేసుకునేవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో పలువురు నాయకులు పెట్టడంతో లబ్ధిదారు లందరూ తమ పనులన్నింటిని వదిలేసుకుని మీ సేవ కేంద్రాల వైపు పరుగులు తీసినప్పటికీ అధికారిక వ్బుసైటు ఓపెన్ కాకపోవడంతో ఎదురుచూపులు తప్పలేదు.

సామా జిక మాధ్యమాల్లో దరఖాస్తులు చేసుకోవాలని వస్తున్నాయని ఎందుకు దరఖాస్తు చేయడం లేదని మీ కేంద్రాల నిర్వహకు లతో లబ్ధిదారులు మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ అధికారిక వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో ఓపెన్ కాకపోతే తాము ఎలా చేయగలమని నిర్వాహకులు లబ్ధిదారులకు వివరిస్తున్నారు. 

రేషన్ కార్డు కోసం ఎదురు చూపులేనా..? 

రేషన్ కార్డు ప్రక్రియ 2019 నుంచి ముందుకు సాగడం లేదు. కనీసం ఇంటికి వచ్చిన కొత్త కోడలి పేరునైనా చేర్చకపోవడంతో సంక్షేమ పథకాలకు అరులు కాలేకపోతున్నారు. పుట్టిన పిల్లలు పెద్దవారవు తున్న  కార్డులో పేరు నమోదు ప్రక్రియ లేకపోవడంతో కుల ఆదాయ ధ్రువీకరణ పత్రలకు తిప్పలు తప్పడం లేదని తల్లిదం డ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డును  ప్రామాణి కమవుతున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలలో దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా పోతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లా వివరాలు.. 

జిల్లాలో లక్షా 46 వేల పైచిలుకు ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. గతంలో కొత్త పిల్లల నమోదుకు అవకాశం ఇవ్వగా.. జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 వేల పైచిలుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికి ఎలాంటి ఫలితం దక్కకుండా పోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు.