calender_icon.png 3 March, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యారెంటీలు చేతగాక గాలిమాటలా?

02-03-2025 12:52:31 AM

  1. అత్యంత బాధ్యతారాహిత్యంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
  2. మీ మాటలు వినే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు
  3.  ఆర్‌ఆర్‌ఆర్, మెట్రోకు రాష్ట్రం కేటాయించిన నిధులేవి?
  4. రింగ్‌రోడ్డు సెకండ్ ఫేజ్ నిర్మించుకుంటామని ఇప్పుడు మాట మారుస్తారా..
  5. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలుచేయలేక సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నా రని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. బాధ్యతారహితంగా, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని,  రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటాయింపులో తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఇందిరమ్మ రైతు భరోసా రూ.15వేలు, కౌలు రైతులకు రూ. 15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు, రూ.5 లక్షలు, ఇంటి స్థలం, విద్యాభరోసా కార్డు, పెన్షన్ రూ.4 వేలు లాంటి విషయాల్లో బాధ్యతను విస్మరించి ప్రవర్తిస్తున్నారని, గాలిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్‌లలో 50 శాతం బీసీలకు కేటాయించిన సీట్లలో 30 సీట్లలో నాన్ బీసీలు (ముస్లింలు) బీసీ కోటాలో గెలుచుకొని లబ్ధి పొందుతుంటే నోరు మూసుకోవాలా అని ప్రశ్నించారు. బీసీలపై సీఎం రేవంత్ నిజస్వరూపమిదని మండిపడ్డారు. ఏపీలో నిబంధనలకు వ్యతిరేకంగా ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను తాము స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రద్దు చేస్తామన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నారని, తాను తెలంగాణ అభివృద్ధిపై అనేక ప్రాజెక్టులపై ప్రజలకు వివరిస్తూనే ఉన్నానని చెప్పారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ర్ట ప్రభుత్వం సహకారం అందించకపోవడం వల్ల అమ లు చేయలేదని ఇందుకు పంటలబీమా, ఆయుష్మాన్‌భవ పథకాలే ఉదా హరణలన్నారు.

ప్రజావ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే..

కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ సమర్థవం తంగా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు, 320 సబ్ గ్యా రెంటీల అమలులో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రె స్‌లో అంతర్గత కుమ్ములాటలు, సీఎంపై అసంతృప్తి ఆయన మాట్లాడుతున్న విధానంలోనే స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బీజేపీని, తనను బ్లాక్‌మెయిల్ చేయడం, బెది రించినంత మాత్రాన ఆయనపై ఉన్న వ్యతిరేకత పోదన్నారు. తెలంగాణ ప్రజలు ఆయ న మాటలు వినే పరిస్థితిలో లేరన్నారు. 

ఇచ్చిన హామీలు అమలు చేతగాక.. 

తెలంగాణకు టెక్స్‌టైల్ పార్క్, కోచ్ ఫ్యాక్టరీ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి కీలకమైన ప్రాజెక్టులను తీసుకొచ్చానని కిషన్ రెడ్డి చెప్పారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు తాను ప్రాధాన్యమిస్తానని తెలిపారు. అంతేగాని ప్రాజెక్టులను తాను అడ్డుకుంటున్నానని అనడం.. ఊహించడం కూడా తప్పేనన్నారు.

తాను ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేవాడినని, తాటాకు చప్పుళ్లకు భయపడబోనన్నారు. డిసెంబర్ 24 లోపల రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడరెందుకని నిలదీశారు. రైతులకు సంబంధించి ఇచ్చిన హామీలు మాట్లాడే పరిస్థితి లేదన్నారు.

ఇందిరమ్మ రైతు భరోసా రూ.15వేలు, కౌలు రైతులకు రూ. 15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు, రూ.5 లక్షలు, ఇంటి స్థలం, విద్యాభరోసా కార్డు, పెన్షన్ రూ.4 వేలు లాంటి విషయాల్లో బాధ్యతను విస్మరించి ప్రవర్తిస్తున్నారని, గాలిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ప్రాజెక్టులకు మీ కేటాయింపులెంత?

తనకు రాసిన లేఖలో రూ.1.66 లక్షల కోట్ల నిధులు మంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి కూడా ఇంత పెద్దఎత్తున నిధులు మంజూరు చేసిన పరిస్థితి లేదన్నారు. అలాగే రాష్ర్ట ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలని నిలదీశారు.

ఈ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా..? ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందా? అని నిలదీశారు. సీఎం మాటలకు అధికారులే నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం ఇచ్చిన వివరాలను ఆయా మంత్రుల వారీగా విభజించి జనవరి 23నే లేఖలు పంపించామన్నారు.

వాస్తవం ఈ రకంగా ఉంటే తాను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామని వితండవాదం చేసే ప్రయత్నాలకు తెరతీశారన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేయించిందే తానన్నారు. ఈ విషయంలో తాను కేసీఆర్‌కు కూడా అనేక లేఖలు రాశానన్నారు. భూసేకరణపై 50 శాతం రాష్ర్ట ప్రభుత్వం అందించాలని అనేకసార్లు విన్నవించామన్నారు.

సీఎం రేవంత్‌కు కూడా లేఖ రాశామన్నారు. రింగ్ రోడ్డుకు రాష్ర్ట ప్రభుత్వం వందకోట్లు కేటాయించిందన్నారు. త్వరలో మంజూరు కాబోతుంద న్నారు. తొలిదశ పనులపై క్యాబినెట్ ఓకే చెప్పనుందని, దీనికి సీఎం సర్టిఫికెట్ అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ ఉంటే చాలన్నారు. 

మెట్రో అలైన్‌మెంట్ మార్చి

ఆర్‌ఆర్‌ఆర్ మొదటి ఫేజ్ పనులకు అనుమతులు రాగానే.. మొదటి దశ పనులను తామే సొంతంగా చేపడుతున్నామని మీడియా సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని కిషన్‌రెడ్డి తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సం బంధం లేదన్నారు. ఇందుకు సంబంధిం చి ఓ కన్సెల్టెన్సీని కూడా టెండర్ ద్వారా పిలిచి తిరిగి సర్వే చేయిస్తున్నారని తెలిపారు.

గతంలో చేసిన సర్వేను మార్చి గందరగోళం చేసి చివరకు ఇప్పు డు మాట మార్చుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఉన్నప్పుడే మెట్రో 2 ఫేజ్ కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిందన్నారు. సీఎం రేవంత్ రాగానే కేంద్రానికి లేఖ రాసి మెట్రో సమగ్రంగా లేదని 2024 జనవరి 4న ఢిల్లీకి హర్దీప్‌సింగ్ పూరిని కలిసి కొత్త ప్రతిపాదన విషయాన్ని తెలిపారన్నారు.

2024 అక్టోబర్ 26 వరకు కూడా రాష్ర్ట ప్రభుత్వం ప్లానింగ్, ప్రణాళిక కేంద్రానికి అందలేదన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం కి.మీకు రూ. 234 కోట్ల తో 62కి.మీ పనుల ప్రతిపాదనలను పం పితే.. రేవంత్ రెడ్డి 76 కి.మీ. పొడవుతో ప్రతీ కి.మీకు రూ. 317 కోట్లకు పెంచారని అన్నారు. తొలిదశలో ఫలక్‌నుమా వరకు అయ్యే ఖర్చులో కేంద్రం రూ. 1,200 కోట్లు ఇచ్చిందన్నారు.

అఫ్జల్‌గంజ్‌లోనే దాన్ని ఆపివేశారని అప్పటి పను లు ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. మెట్రో డీపీఆర్‌కే రేవంత్ సర్కార్‌కు 10 నెలలు పడితే ఏ ప్రాతిపదికన కేంద్రం, బీజేపీ, కిషన్ రెడ్డి అడ్డుకున్నారంటూ ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు.