calender_icon.png 3 February, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే నిధులా?

03-02-2025 12:47:52 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని  పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే ఎక్కువ కేటాయించారని విమర్శించా రు.

ఎన్నికలున్న రాష్ట్రాలకు నిధులు కేటాయించి మిగతా రాష్ట్రాలను పట్టించుకోరా..? అని ప్రశ్నించారు. ఢిల్లీ అ సెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులు రోహిత్ చౌదరీ, దీక్షిత్ తదితరుల తరుపున వారం రోజులుగా ప్ర చారం నిర్వహించారు.

ఈ సందర్భం గా ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లకు నిధులు ఇవ్వబోమని ఓ నేత అంటున్నారని, ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలన్నారు. దేశంలో కులాలవారీగా జనగణన తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.