- పెట్టుబడుల కట్టుకథలు ఎవరూ నమ్మట్లేదు
రైతు భరోసా చిల్లర పంచాయితీనా
చబ్బీస్ జనవరి చేదుమాత్రనే.. మళ్లా మార్చి 31 గడువా?
మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ఎప్పు డో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడు ఎందుకు ఈ దావ త్.. రైతుల అప్పులు ముఖ్యమా.. దావోస్ డప్పులు ముఖ్యమా అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీమంత్రి హరీశ్‌రావు మంగళవా రం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. సీఎం ప్రెస్‌మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టుకథ ను నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నిం చి అట్టర్‌ఫ్లాప్ అయినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
‘మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడంలేదని ప్రెస్‌మీట్ పెట్టావు..’ అని విమర్శించారు. దావోస్‌లో జరిగే ఎంవోయూలన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే.. ఎవరైనా ఓపెన్ టెండర్లో రావాల్సిందే.. అని ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క అంటే, సీఎం మాత్రం లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గప్పాలు చెబుతున్నారని తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి చెప్పింది నిజమా?.. మీ మాటలు నిజమా? రేవంత్ రెడ్డి.. అని ప్రశ్నించారు. పొంతన లేకుండా చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించిందని, అంతా డొల్ల ప్రచారమని తేలిపోయిందన్నారు.
“రైతు భరోసా కోసం గంపెడు ఆశతో, కొండంత ఆందోళనతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటావా?...ఇంతకు ముందు రైతుబంధును బిచ్చం అన్నావు, ఇప్పుడు రైతు భరోసాను చిల్లర పంచాయితీ అంటున్నావు..”అని మండిపడ్డారు.
చబ్బీస్ (26) జనవరి చేదుమాత్రనే అయ్యిందని, ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెంచారని పేర్కొన్నారు. ‘నీలో అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ మొదలైంది.. నీ మాటలు ఎవరూ నమ్మడం లేదనే ఆందోళన పెరిగిపోయింది.. మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం మంచిది” అని హరీశ్ ఎద్దేవా చేశారు.