* శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాం తి): ప్రభుత్వం అన్ని అంశాల్లో విశ్వసనీయత కోల్పోయిందని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలు చేస్తున్నారని సనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమ ర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే అరెస్టులు, బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆగ్రహించారు.
గొప్పగా ఇస్తామన్న రైతు భరోసాకు అనేక షరతులు పెట్టారని, ఎకరాకు రూ.15 వేలు అని చెప్పి, రూ.12 వేలు ఇస్తామనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రైతుల్లో ఆగ్రహం ఉందని తెలుసుకుని అరెస్టు లు, కేసులు వంటి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని, కాంగ్రెస్ పాలనలోనూ అదే జరుగుతోందన్నారు. హైకోర్టులో తీర్పురిజర్వులో ఉండగా కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు.