calender_icon.png 7 November, 2024 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సచివాలయంలో వాస్తు మార్పులు

07-11-2024 01:53:29 AM

రెండో, నాలుగో గేటు మధ్య రోడ్డు నిర్మాణం

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్ర సచివాలయంలో వాస్తు మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. సచివాలయంలో గతంలో కొన్ని వాస్తు మార్పులు చేసిన రేవంత్ సర్కారు.. ఇప్పుడు ఆరు బయట కొన్ని మరమ్మతులు చేపడుతోంది. ఇది వరకు రెండో గేట్ నుంచి నాలుగో గేట్ వరకు రోడ్డు పూర్తిస్థాయిలో ఉండేది కాదు.

ఇప్పుడు నేరుగా రెండు గేట్ల మధ్య రోడ్డును నిర్మించేందుకు తవ్వకాలు చేపట్టింది. బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన ద్వారాన్ని కూడా పూర్తిస్థాయిలో తొలగించనున్నట్టు తెలుస్తోంది. ప్రధాన ద్వారాన్ని తొలగించి హుస్సేన్‌సాగర్ వైపు మరో గేటు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఆలోగా సచివాలయంలో వాస్తు మార్పులు పూర్తి కావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనులను చేపడుతున్నది.