చెన్నై: చెన్నై గ్రాండ్‌మాసర్ట్స్ టోర్నీ విజేతగా భారత గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం నిలిచాడు. క్లాసికల్ ఫార్మాట్‌లో జరిగిన టోర్నీలో చివరి రెండు రౌండ్లు అరవింద్ విజయంలో కీలకపాత్ర పోషించాయి. అరవింద్ తన చివరి రౌండ్‌లో పర్హమ్ మగ్‌సూద్లోను ఓడించాడు. అంతకముందు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసికి చెక్ పెట్టి సంచలన విజయం సాధించాడు.
దీంతో స్కోర్లు టై కాగా.. అర్జున్ ఇరిగేసి, లెవన్ అరోనియన్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రా కావడంతో అర వింద్ విజేతగా నిలిచాడు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని గ్రాండ్‌మాస్టర్ వి. ప్రణవ్ చాలెంజర్స్ క్రౌన్‌ను గెలుచుకోవడం విశేషం. టోర్నీలో నాలుగు విజయాలు, మూడు డ్రాలు చేసుకున్న ప్రణవ్ వచ్చే ఏడాది మాస్టర్స్ కేటగిరీకి నేరుగా అర్హత సాధించాడు. మిగిలిన మ్యాచ్ ల్లో ఆర్. వైశాలీపై మురళీ కార్తికేయన్ విజయం సాధించగా.. అభిమన్యుతో రౌనక్ సద్వానీ, హారికతో ప్రనేశ్ గేమ్‌లు డ్రా చేసుకున్నారు.