calender_icon.png 28 October, 2024 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరమ్ పెట్టుబడి ౩౩5౦ కోట్లు

10-08-2024 01:46:11 AM

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు భారీ స్పందన లభిస్తుంది. ఇప్పటికే 11 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. తాజాగా ఆరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో దాదాపు రూ.3,350 కోట్లతో భవిష్యత్ తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రీన్ డాటా సెంటర్ నిర్మించనున్నట్టు ప్రకటించింది. దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో సంస్థ సీఈవో, చైర్మన్ వెంకట్ బుస్సా సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికలతోపాటు భారీ పెట్టుబడులను కంపెనీ ప్రకటించారు.

గత ఏడాది ఆరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడుదానిని భారీగా విస్తరించింది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డాటా సెంటర్‌ను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి దాదాపు రూ.3,350 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్రీన్ డాటా సెంటర్ ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఆరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థ కొత్త బిటా సెంటర్ ఏర్పాటును మంత్రి శ్రీధర్‌బాబు స్వాగతించారు.