calender_icon.png 2 January, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరకులో ఫైనల్ షెడ్యూల్

09-11-2024 12:00:00 AM

విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ ఇప్పటికే రెండు పెద్ద హిట్‌లను అందించింది. హ్యాట్రిక్ కొలాబరేషన్ నుంచి వస్తున్న మరో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీ నాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. ఉపేంద్ర లిమా యే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేశ్, గణేశ్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయిశ్రీనివాస్, ఆనంద్‌రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేశ్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి ఇతర పాత్రలు పోషిస్తు న్నారు.

అయితే, ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఫైనల్ షెడ్యూల్‌ను అరకులో ప్రారంభించింది చిత్రబృందం. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ రిలీజ్ చేసి వీడియోలో స్కూల్ స్టూడెంట్స్ హీరో వెంకటేశ్‌కు సాదరంగా స్వాగతం పలకడం, ఆయన ఆప్యాయంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: ఎస్ కృష్ణ, జీ ఆదినారాయణ; యాక్షన్ కొరియోగ్రఫీ: వీ వెంకట్.