calender_icon.png 20 March, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత

17-03-2025 12:33:37 AM

ప్రముఖ సంగీత దర్శకు డు ఏఆర్ రెహమాన్ ఆదివారం ఉదయం అస్వస్థతకు గురయ్యా రు. ఆయన ఛాతీ నొప్పి కారణం గా ఆసుపత్రిలో చేరారని వార్త లు వచ్చిన దరిమిలా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, చెన్నై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్య కారణంగానే రెహమాన్ అస్వస్థతకు గురయ్యారని, చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. రెహమాన్ సంగీతం అందించిన ‘ఛావా’ ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘ఆర్‌సీ16’ కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేసినట్టు రెహమాన్ ఇటీవలే వెల్లడించారు.