సంగీత విద్వాంసుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, అతని భార్య సైరా బాను తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే, వారి విడాకుల పోస్ట్‌పై ఏఆర్ రెహమాన్ వింత హ్యాష్‌ట్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. #arrsairabreakup అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. సున్నితమైన పోస్ట్‌లో దీన్ని ఉపయోగించినందుకు రెహమాన్‌ను పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. సైరా తరపు న్యాయవాది ఒక ప్రకటన విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత, రెహమాన్ తన బాధను ఎక్స్‌పై ఎమోషనల్ నోట్‌తో వ్యక్తపరిచాడు. మేము గ్రాండ్ థర్టీకి చేరుకుంటామని ఆశించాము, కానీ అనూహ్య రీతిలో ముగింపు పకాల్సివచ్చింది. విరిగిన హృదయాలు దైవాన్ని కూడా ప్రభావితం చేస్తాయని, ముక్కలు హృదయాలు మళ్లీ అతుక్కోలేవని పేర్కొన్నారు. ఇలాంటి కఠనమైన పరిస్థితుల్లో వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామంటూ రెహమాన్ ఎక్స్ లో పోస్టు చేశారు. రెహమాన్ దంపతులు 1995లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 29 ఏళ్ల వివాహ బంధాన్ని కొనసాగించాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఖతీజా, రహీమా, అమీన్. 1995లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.