16-03-2025 11:08:33 AM
చెన్నై,(విజయక్రాంతి): ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అస్వస్థత గురయ్యారు. శనివారం రాత్రి రెహమాన్ కు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబీకులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆదివారం ఉదయం ఆయనను గ్రీమ్స్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెహమాన్‌కు కార్డియాలజీ విభాగం వైద్యులు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ సహా పలు పరీక్షలు నిర్వహించి యాంజియోగ్రామ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఆదివారం వైద్యులు వెల్లడించారు.