20-03-2025 10:24:45 AM
జిల్లా ఎస్పీ సీరియస్
కామారెడ్డి(విజయక్రాంతి): తమ్ముడి భార్యపై దాడికి పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్(AR constable suspended)ను జిల్లా ఎస్పీ రాజీవ్ చంద్ర సస్పెండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సంతోష్ గౌడ్ పై ఆయన మరదలు బిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత పది రోజుల క్రితం సంతోష్ గౌడ్ తమ్ముని భార్యపై కర్రతో దాడి చేసి గాయపరిచి నందుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అరెస్టు తప్పదని తెలుసుకున్న సంతోష్ గౌడ్ గత రెండు రోజులుగా పరార్ లో ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంతోష్ గౌడ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయినట్లు సమాచారం.