calender_icon.png 29 March, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్... పోలీస్...

26-03-2025 05:01:09 PM

మానవత్వం చాటుకున్న ఏఆర్ కానిస్టేబుల్ రసూల్.. 

నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ..

బెల్లంపల్లి (విజయక్రాంతి): కఠినంగా ఉండే పోలీసు శాఖలను మానవత్వం ఉంటుందని నిరూపించారు బెల్లంపల్లి ఏఆర్ కానిస్టేబుల్ రసూల్. తన చిన్నతనం నుండే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న రసూల్ నిరుపేద ముస్లిం కుటుంబాలతో పాటు ఇతరులకు స్వచ్ఛందంగా సహాయం అందించడంతో పాటు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం అలవర్చుకున్నారు. ప్రతినెల తన జీతం డబ్బుల్లో ఎంతోకొంత నిరుపేదలకు సహాయం చేసేందుకు ఖర్చు చేస్తారు. తాను చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం తాను డ్రైవర్ పనిచేస్తున్న తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ ఆవరణలో పది నిరుపేద కుటుంబాలకు కానిస్టేబుల్ రసూల్ నిత్యావసర సరుకులను అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

చిన్నతనం నుండి సేవా కార్యక్రమాలు చేయడం అంటే తనకు చాలా ఇష్టమని, సమాజ హితం కోసం తాను స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్లు కానిస్టేబుల్ రసూల్ తెలిపారు. స్వంతంగా నిరుపేదలకు చిన్నపాటి సహాయాన్ని అందించడం ఎంతో తృప్తినిస్తుందని చెప్పారు. పేదలకు సహాయపడే మంచి మనసున్న రసూల్ ను బుధవారం బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలొద్దిన్, తాళ్ల గురిజాల ఎస్సై చుంచు రమేష్, ఏఎస్ఐ మజారుద్దీన్ లతో పాటు తోటి కానిస్టేబుల్ ప్రత్యేకంగా అభినందించారు.